AP HMFW Recruitment 2022: ఏపీ ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 622 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా..
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ప్రాతిపదికన 622 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి..
AP HMFW Assistant Professor Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ప్రాతిపదికన 622 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (డైరెక్ట్) పోస్టులు 375 ఉండగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ (లేటరల్ ఎంట్రీ) పోస్టులు 247 వరకు ఉన్నాయి. క్లినికల్, సూపర్ స్పెషాలిటీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీలున్నాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, పల్మనాలజీ, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, రేడియాలజీ, రేడియోథెరపీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ అడ్మినిస్ట్రేషన్ తదితర స్పెషలైజేషన్లలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఎంబీబీఎస్‌తోపాటు ఎంఎస్/ఎండీ/ఎండీఎస్/డీఎం/ఎంహెచ్/ఎంఎస్సీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినట్లు సర్టిఫికేట్ ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు ఆగస్టు 4, 2022 నాటికి 42 నుంచి 52 యేళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తు రుసుముగా జనరల్ అభ్యర్ధులు రూ.1500లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్ధులకు రూ.1000లు చెల్లించవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 20, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడొచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.