International Lefthanders Day 2022: ఎడమచేతి వాటం వారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు.. ఐన్‌స్టిన్‌ నుంచి అమెరికా ప్రెసిడెంట్ల వరకు..

కుడి చేతివాటం వారి కోసం సృష్టించిన ఈ ప్రపంచంలో ప్రతీ పని ఎడమచేతితోనే చేసుకునేవారు (Left-Handers) బతకడం కత్తి మీద సాము వంటిదే. చిన్న తనంలో స్కూళ్లలో ఉండే..

International Lefthanders Day 2022: ఎడమచేతి వాటం వారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు.. ఐన్‌స్టిన్‌ నుంచి అమెరికా ప్రెసిడెంట్ల వరకు..
International Lefthanders
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 13, 2022 | 11:33 AM

Know the History, Significance and Theme of International Lefthanders Day 2022: ఆగస్టు 13వ తేదీన ఇంటర్నేషనల్‌ లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే గా జరుపుకుంటారు. 1976, ఆగస్టు 13 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కుడి చేతివాటం వారి కోసం సృష్టించిన ఈ ప్రపంచంలో ప్రతీ పని ఎడమచేతితోనే చేసుకునేవారు (Left-Handers) బతకడం కత్తి మీద సాము వంటిదే. చిన్న తనంలో స్కూళ్లలో ఉండే క్లాస్‌ రూం డెస్క్‌లు దగ్గరి నుంచి నోట్‌ బుక్‌లు, పెన్నులు, కత్తెరలు, మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇలా ప్రతి వస్తువును ఉపయోగించడం ఓ సవాలే. ఈ విషయంతో మానవ మెదడుని మెచ్చుకోకతప్పదు. కుడిచేతి వాటం ప్రపంచంలో జీవించడానికి పోరాటం చేయవల్సి ఉంటుంది. అందుకు వారు కొత్తగా ఆలోచిస్తారు. ఆ అలవాటే ఎడమచేతి వాటం కలిగిన వారిలో అనేకులు చరిత్ర పుటల్లో వారికంటూ ప్రత్యేక పేజీని రాసుకున్నారు. సైంటిస్టులు, క్రీడాకారులు, చక్రవర్తులు, తాత్వికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలుగా పేరుగాంచిన ప్రముఖులందరూ ఎడమచేతివాటం వారే. నిజానికి ఎడమచేతి వాటం కలిగిన వాళ్లు మరింత స్వతంత్రంగా జీవిస్తారని వీరిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు భూమిపై ఉన్న మొత్తం జనాభాలో 5-10% మంది ఎడమచేతి వాటం వారు ఉండటం గమనార్హం. అందులోనూ అమెరికా మొత్తం జనాభాలో 30 మిలియన్ల ప్రజలు ఎడమచేతి వాటంవారే ఉండటం విశేషం.

ఎడమచేతి వాటం వారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు..

  • కుడి చేతివాటం వారితో పోల్చితే వీరిలో మద్యపానం అలవాటు మూడు రెట్లు ఎక్కువ.
  • వీరు మెదడులో కుడి భాగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
  • సాధారణ మనుషులకంటే వీరిలో 4-5 నెలలు ఆలస్యంగా మానసిక పరిపక్వత ఉంటుంది.
  • టాప్‌ టెన్నీస్‌ ప్రేయర్లలో 40 శాతం ఎడమచేతివాటం వారే ఉండటం గమనార్హం.
  • 26 మంది అమెరికా ప్రెసిడెంట్లలో 8 మంది ఎడమచేతి వాటంవారే.
  • 40 యేళ్లు దాటిన మహిళలు గర్భం దాల్చితే పుట్టే పిల్లల్లో 128 శాతం ఎడమచేతి వాటం ఉన్న శిశువులు జన్మిస్తున్నారని వైద్యులు ధృవీకరించారు.
  • కుడి చేతివాటం వాళ్లు మాటలు చెప్పడంలో మేటి. ఐతే ఎడమచేతివాటం వారు గణితం, అర్కిటెక్చర్‌లో మరింత ప్రతిభావంతులు.
  • కుడి చేతి వాటం వారితో పోల్చితే ఎడమచేతివాటం వారు అలర్జీ, ఆస్తమా వ్యాధుల భారీన ఎక్కువగా పడుతుంటారు.
  • బ్రిటీష్ రాజకుటుంబంలో ఎడమ చేతివాటం కలిగిన రాణులున్నారు. క్వీన్ మదర్, క్వీన్ ఎలిజబెత్ II, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్
  • విలియం వీరంతా ఎడమచేతివాటం కలిగినవారే.
  • వీరిలో నిద్రలేమి (insomnia) సమస్య ఎక్కువ.
  • బోస్టన్ స్ట్రాంగ్లర్, ఒసామా బిన్ లాడెన్, జాక్ ది రిప్పర్ అందరూ ఎడమచేతి వాటం వారే.
  • నెర్వస్ అండ్‌ మెంటల్‌ డిసీజ్‌ జర్నల్‌ అధ్యయనాల్లో కుడి చేతివాటం వారి కంటే ఎడమ చేతివాటం కలిగిన వారికి కోపం ఎక్కువ అని తేలింది.
  • ఎడమచేతి వాటంవారు అధికంగా అర్మీలో చేరుతుంటారు.
  • ఈ భూమిపై అంతరించి పోతున్న అరుదైన జాతులు, జంతువులు, వృక్షాలు మాదిరి అతి తక్కువ సంఖ్యలో ఉన్న ఎడమచేతి వాటం వారి సంఖ్య కూడా ఏదో ఒకనాటికి అంతరించిపోతాయా? అనే మీమాంస కూడా లేకపోలేదు.
Left Handed People

Left Handed People

ఎడమచేతి వాటం ఉన్న ప్రముఖులు అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, బారక్ ఒబామా, బిల్ గేట్స్, జూలియా రాబర్ట్స్చ మార్క్ జుకర్‌బర్గ్, లేడీ గాగా, ఓప్రా విన్‌ఫ్రే, పాల్ మాక్‌కార్ట్నీ, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మేరీ క్యూరీ, హెన్రీ ఫోర్డ్, అరిస్టాటిల్, మొజార్ట్, మైఖేలాంజెలో, లియోనార్డో డా విన్సీ, చార్లీ చాప్లిన్, జిమ్ క్యారీ, టామ్ క్రూజ్, రాబర్ట్ డి నీరో, మాట్ డిల్లాన్, మోర్గాన్ ఫ్రీమాన్, జూడీ గార్లాండ్, హూపీ గోల్డ్‌బెర్గ్, ఏంజెలీనా జోలీ, నికోల్ కిడ్మాన్, వాల్ కిల్మర్, మార్లిన్ మన్రో, సారా జెస్సికా పార్కర్, బ్రాడ్ పిట్, కీను రీవ్స్, సిల్వెస్టర్ స్టాలోన్, డేవిడ్ బౌవీ, సెలిన్ డియోన్, ఎమినెం, కర్ట్ కోబెన్, నోయెల్ గల్లఘర్, బాబ్ గెల్డాఫ్, జిమి హెండ్రిక్స్, రికీ మార్టిన్, ఆల్బర్ట్ ఐన్‌స్టిన్‌, నెపోలియన్ బోనపార్టే, జూలియస్ సీజర్, స్టీవ్ జాబ్స్‌తోపాటు ప్రస్తుత భారత ప్రధాని నరేద్ర మోదీ కూడా ఎడమచేతి వాటం కలిగినవారే.

ఇవి కూడా చదవండి

మీకు తెలిసివారిలో లేదా మీకు కూడా ఎడమచేతి ఆలవాటు ఉంటే బాధపడకండి. పైన తెల్పిన ప్రముఖులందరూ మీలాంటి వారేనని తెలుసుకుని.. మీలో దాగున్న అద్భుత ప్రతిభను వెలికితీసి.. ఈ లిస్టులో మీ పేరును కూడా చేర్చుకునే పనిలో పడితే జీవితం రంగుల మయం అవుతుంది. ఏమంటారు.. నిజమేకదా!

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే