Indian Railways: రైల్వేల ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌లో కీలక మార్పులు..

Indian Railways: ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌లో అనేక మార్పులు రానున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని పార్లమెంట్ కమిటీకి అందజేసింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్..

Indian Railways: రైల్వేల ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌లో కీలక మార్పులు..
Follow us

|

Updated on: Aug 13, 2022 | 11:44 AM

Indian Railways: ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌లో అనేక మార్పులు రానున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని పార్లమెంట్ కమిటీకి అందజేసింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రస్తుతం ఉన్న పీఆర్‌ఎస్ వ్యవస్థపై అధ్యయనం చేస్తోంది. రైల్వే అప్‌గ్రేడేషన్‌కు సూచనలు అందించడానికి ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌ని నియమించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ నేతృత్వంలోని రైల్వే స్టాండింగ్ కమిటీ ‘భారతీయ రైల్వేల ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్’ పేరుతో నివేదికను పార్లమెంట్‌లో సమర్పించింది. ఈ నివేదికలో, 2019-20 సంవత్సరంలో IRCTC వెబ్‌సైట్/యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసిన టిక్కెట్లు రిజర్వేషన్ సెంటర్ సైట్‌లో కొనుగోలు చేసిన టిక్కెట్‌ల కంటే 3 రెట్లు ఎక్కువ అని కమిటీ తెలిపింది. అయితే ఈ వెబ్‌సైట్ సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో దీని ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ -టికెటింగ్ సౌకర్యం ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా రైల్వే కౌంటర్లలో రద్దీని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని కమిటీ సూచించింది. దీంతో పాటు టికెట్‌ కౌంటర్ల వద్ద నకిలీ నోట్లు వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.

పెరుగుతున్న ఇ-టికెటింగ్‌ల సంఖ్య

IRCTC వెబ్‌సైట్/సర్వర్‌ల సామర్థ్యాన్ని మరింత పటిష్టంగా నిర్వహించడం కోసం మరింత పటిష్టంగా ఉండేలా వాటిని క్రమంగా బలోపేతం చేయడం, అప్‌గ్రేడ్ చేయడం అవసరమని కమిటీ మంత్రిత్వ శాఖకు తెలిపింది. IRCTCకి 7.60 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్‌ను బలోపేతం చేయడానికి 2014లో ప్రారంభించిన సిస్టమ్ సామర్థ్యాన్ని నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తన సమాధానంలో కమిటీకి తెలిపింది. డిసెంబర్ 2021 నాటికి భారతీయ రైల్వే ఇ-టికెటింగ్ కింద మొత్తం రిజర్వ్ చేసిన టిక్కెట్ల వాటా 80.5 శాతానికి చేరుకుంది. IRCTCకి 100 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారని, అందులో 760 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని ఆయన చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2016-17 సంవత్సరంలో భారతీయ రైల్వేలో మొత్తం రిజర్వ్ చేసిన టిక్కెట్లలో ఇ-టికెట్ల వాటా 59.9 శాతం. 2018-19 సంవత్సరంలో 70.1 శాతం, 2019-20 సంవత్సరంలో 72.8 శాతం, 2020-21 సంవత్సరంలో 79.6 శాతం, 2021-22లో డిసెంబర్‌ వరకు 80.5 శాతం వరకు నమోదు చేయబడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...