AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Update: కోట్లాది మంది రేషన్ కార్డు లబ్ధిదారులపై ప్రభావం.. ఉచిత గోధుమల పంపిణీపై నిషేధం..!

Ration Update: మీకు కూడా రేషన్ కార్డ్ ఉండి, ప్రభుత్వ ఉచిత రేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటుంటే ఈ వార్త మీ కోసమే. దీనిపై ప్రభుత్వం నుంచి పెద్ద అప్‌డేట్‌ వచ్చింది...

Ration Update: కోట్లాది మంది రేషన్ కార్డు లబ్ధిదారులపై ప్రభావం.. ఉచిత గోధుమల పంపిణీపై నిషేధం..!
Subhash Goud
|

Updated on: Aug 12, 2022 | 7:59 PM

Share

Ration Update: మీకు కూడా రేషన్ కార్డ్ ఉండి, ప్రభుత్వ ఉచిత రేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటుంటే ఈ వార్త మీ కోసమే. దీనిపై ప్రభుత్వం నుంచి పెద్ద అప్‌డేట్‌ వచ్చింది. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆగస్టు 18 నుండి ఆగస్టు 31 వరకు రేషన్ పంపిణీ చేయబడుతుంది. అయితే ఈసారి కార్డుదారులకు ఉచితంగా గోధుమలు అందడం లేదు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం 3 కిలోల గోధుమలు, 2 కిలోల బియ్యం లభిస్తున్నాయి. వాస్తవానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తరపున ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రాష్ట్రాలకు గోధుమలు, బియ్యం ఉచితంగా పంపిణీ చేయబడుతున్నాయి. దీని కింద అర్హులైన రేషన్ కార్డుదారులకు 3 కిలోల గోధుమలు, 2 కిలోల బియ్యం అందజేస్తారు. అయితే గత జూన్ 1 నుంచి ప్రభుత్వం ఈ నిబంధనను మార్చి ఉచితంగా గోధుమలకు బదులు బియ్యం ఇస్తున్నారు. అంటే 3 కిలోల గోధుమలు, 2 కిలోల బియ్యానికి బదులు లబ్ధిదారుడికి 5 కిలోల బియ్యం అందజేస్తోంది. ఈసారి గోధుమల సేకరణ తక్కువగా ఉన్నందున గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మే నుంచి సెప్టెంబర్ వరకు పంపిణీ చేయాల్సిన గోధుమల కోటాను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. యూపీ, ఎంపీ సహా పలు పెద్ద రాష్ట్రాలపై దీని ప్రభావం కనిపిస్తోంది. దీనికి సంబంధించి, యూపీ ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ నుండి ఇప్పటికే రాష్ట్ర జిల్లా మేజిస్ట్రేట్‌లకు లేఖ జారీ చేయబడింది.

గోధుమల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ సమయంలో సుమారు 55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా కేటాయించనున్నట్లు ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. ఈ మార్పు PMGKAY పథకంలో మాత్రమేనని తెలిపారు. సెప్టెంబర్ తర్వాత 3 కిలోల గోధుమలు యథావిధిగా పంపిణీ ప్రక్రియ ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని భావిస్తున్నామని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి