Johnson & Johnson: బేబీ పౌడర్‌తో క్యాన్సర్… ఆరోపణల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్న జాన్సన్ & జాన్సన్..
Johnson powder: కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్ విక్రయాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా ఈ బేబీ పౌడర్ కారణంగా క్యాన్సర్ వ్యాపిస్తుందని ఆరోపణలు వచ్చాయి. ఈ పౌడర్‌లోని...
Johnson powder: కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్ విక్రయాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా ఈ బేబీ పౌడర్ కారణంగా క్యాన్సర్ వ్యాపిస్తుందని ఆరోపణలు వచ్చాయి. ఈ పౌడర్‌లోని ఆస్‌బెస్టాస్ అవశేషాలు క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయని చాలా మంది కస్టమర్లు కోర్టు మెట్లు ఎక్కారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ బేబీ పౌడర్ ఉత్పత్తులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే జాన్సన్ 2020లోనే అమెరికా, కెనడాలో బీబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 2023 నాటికి టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ విక్రయాలను నిలిపివేయనున్నట్లు ప్రకటించిన జాన్సన్ అండ్ జాన్సన్. కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ పోర్ట్‌ఫోలియోకు మారాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్న్ స్టార్చ్‌తో తయారు చేసే బేబీ పౌడర్‌ను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నారు.
జాన్సన్ పౌడర్ వల్ల క్యాన్సర్‌కు గురయ్యమాని బాధితులు, చనిపోయిన వారి బంధువులు కొందరు కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలోనే పలు కోర్టులు బాధితులకు సానుకూలంగా తీర్పులిచ్చాయి. జాన్సన్ అండ్ జాన్సన్ 22 మంది మహిళలకు 2 బిలియన్ల డాలర్లకుపైగా పరిహారం కూడా అందించింది. ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో జాన్సన్ పౌడర్ అమ్మకాలను నిలిపి వేయాలని కోరుతూ చాలా మంది కోర్టులో దావా వేశారు.
ఇది కూడా చదవండి..