Bank of Baroda: ఇక బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రుణాలు మరింత ప్రియం.. పెరిగిన వడ్డీ రేట్లు

Bank of Baroda: ప్రస్తుతం అన్ని బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రెపోరేటుకు అనుగుణంగా బ్యాంకులు వడ్డీ రేట్ల విషయంలో..

Bank of Baroda: ఇక బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రుణాలు మరింత ప్రియం.. పెరిగిన వడ్డీ రేట్లు
Follow us

|

Updated on: Aug 11, 2022 | 9:57 PM

Bank of Baroda: ప్రస్తుతం అన్ని బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రెపోరేటుకు అనుగుణంగా బ్యాంకులు వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇందులో భాగంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని టెన్యూర్‌ రుణాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. ఈ పెంచిన వడ్డీ రేట్లు ఆగస్టు 12 నుంచి అమల్లోకి రానున్నట్లు స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల‌కు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది.

గత సంవత్సరం వ్యక్తిగత, కన్జూమర్‌ లోన్లపై ఎంసీఎల్‌ఆర్‌ 7.65 నుంచి 7.70 శాతానికి పెంచింది. 1 నెల రోజు వ్యవధిగల రుణాలపై 7.40 శాతం, 3 నెలల టెన్యూర్‌ లోన్లపై 7.45 శాతం, 6 నెలల గడువుపై 7.55 శాతానికి చేరింది. ఇక రిటైల్‌ లోన్లపై బీఆర్‌ఎల్‌ఎల్‌ ఆర్‌ 7.95 శాతానికి పెరిగింది. ఇలా ఒక్కో బ్యాంకు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇలా రుణాలపై వడ్డీ రేట్లను పెంచడంతో వినియోగదారులపై మరింత భారం పెరగనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి