Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Floating Post Office: భారతదేశంలో నీటిలో తేలియాడే పోస్టాఫీసు.. ఎక్కడుందో తెలుసా..? ఎన్నో ఆసక్తికరమైన విషయాలు

Floating Post Office In Water: భారతదేశ పోస్టల్ సర్వీస్‌కు ఎంతో చరిత్ర ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ పోస్టల్‌ సర్వీసు ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ఉత్తరాల నుంచి..

Floating Post Office: భారతదేశంలో నీటిలో తేలియాడే పోస్టాఫీసు.. ఎక్కడుందో తెలుసా..? ఎన్నో ఆసక్తికరమైన విషయాలు
Post Office
Follow us
Subhash Goud

|

Updated on: Aug 12, 2022 | 8:22 PM

Floating Post Office In Water: భారతదేశ పోస్టల్ సర్వీస్‌కు ఎంతో చరిత్ర ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ పోస్టల్‌ సర్వీసు ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ఉత్తరాల నుంచి మొదలు ఇప్పుడు వివిధ పథకాలు, వివిధ రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ నేటికీ పోస్టల్‌ నెట్‌వర్క్ చాలా బలంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ సర్వీస్ భారతదేశంలోనే ఉందని నివేదికలు చెబుతున్నాయి. భారతీయ పోస్టల్ సర్వీస్ చరిత్ర 500 సంవత్సరాలకు పైగా ఉంది. భారతీయ పోస్టల్ సర్వీస్ నెట్‌వర్క్ చాలా పెద్దది అయినప్పటికీ, అనేక ప్రత్యేకమైన అనేక విషయాలు ముడిపడి ఉన్నాయి. అయితే దేశంలో ఓ పోస్టాఫీసుకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అది నీటిలో తేలియాడుతూ ఉంటుంది. ఈ విషయం చాలా వింతగా అనిపించినా ఇది నిజం. ఈ పోస్టాఫీసు నేడు పర్యాటక ప్రదేశంగా కూడా పేరొందుతోంది. దీనిని చూసేందుకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. ఇది ఎక్కడో కాదు మన భారతదేశంలోనే ఉంది. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు తెలియజేస్తున్నాము.

ఈ పోస్టాఫీసు ఇక్కడ ఉందంటే..

ఈ పోస్టాఫీసు భారతదేశ స్వర్గధామంగా భావించే జమ్మూ కాశ్మీర్‌లో ఉంది. శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సులో ఉన్న ఈ పోస్టాఫీసు 9 సంవత్సరాల క్రితం చాలా అధ్వాన్నంగా ఉంది. అప్పట్లో పోస్ట్ మాస్టర్ జనరల్ జాన్ శామ్యూల్ ఎన్నో ప్రయత్నాలు చేసి పోస్టాఫీసును తారుమారు చేశారన్నారు. అతని కృషి కారణంగా ఈ పోస్టాఫీసు ఒక అందమైన ప్రదేశంగా మారిపోయింది. నేడు ఇది దాల్ సరస్సు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది.

ఇవి కూడా చదవండి

పోస్టాఫీసు మొదటి పేరు:

ఫ్లోటింగ్ పోస్టాఫీసుగా పిలువబడే ఈ పోస్టాఫీసుకు గతంలో నెహ్రూ పార్క్ పోస్ట్ ఆఫీస్ అని పేరు పెట్టారు. తర్వాత కొత్త పోస్ట్‌మాస్టర్ జాన్ శామ్యూల్ దీనికి ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అని పేరు పెట్టారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దీన్ని ప్రారంభించారు. ఈ పోస్టాఫీసులో రెండు గదులు ఉన్నాయి. ఫ్లోటింగ్ పోస్టాఫీసు ఇతర ఆఫీస్ లాగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాగా, 2014లో వరదల కారణంగా ఈ పోస్టాఫీసు పరిస్థితి మరింత దిగజారింది. అయితే ఎలాగోలా దాన్ని సరస్సు నుంచి బయటకు తీశారు. తర్వాత పరిస్థితి సాధారణం కావడంతో దాల్ సరస్సు వద్దకు తీసుకొచ్చారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదికూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు