RBI Circular : లోన్ రికవరీ ఏజెంట్లకు RBI హెచ్చరిక.. మీ ప్రవర్తనను మార్చుకోకుంటే కఠిన చర్యలు..
Reserve Bank of India: లోన్ రికవరీ ఏజెంట్లతో తమ ప్రవర్తనను మెరుగుపరచుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులను కోరింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల కోసం ఆర్‌బీఐ కొత్త సర్క్యులర్‌ను విడుదల చేసింది.
కేసులైనా, అరెస్టులైనా డోంట్ కేర్.. వారి ఆగడాలు ఆగడం లేదు. పోలీసులు ఎంతకఠినంగా వ్యవహరించినా తీరుమార్చుకోవడం లేదు. వేధింపులు, దాడులకు పాల్పడుతూ బాధితులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. చచ్చిపోయినా సరే డబ్బు మాత్రం కట్టాల్సిందేనంటూ యమకింకరుల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. అప్పులందు ఈ అప్పులు చాలా డేంజర్ సుమా. మినిస్టర్వా.. అయితే ఎవడికి గొప్ప. ముందు మీ నంబర్ మాతానుంది. ఫస్టు పైసల్ కట్టు.. తర్వాత నీ మినిస్ట్రీ ఏంటో చూస్కో. అన్నతీరుగా లోన్ యాప్‌ల బ్లాక్‌మెయిల్ పీక్స్‌లో నడుస్తుంటాయి. సామాన్యులే కాదు.. అమాత్యులను సైతం లోన్ రికవరీ ఏజెంట్లు ప్రవర్తిస్తుంటారు. వారెంత కరుడుగట్టిన రాక్షసులో అర్థమవుతోంగా.. మినిస్టర్లకే ధమ్కీ ఇస్తుంటే.. ఇక సామాన్యులో లెక్కనా.. మధ్యతరగతి జీవి పరువుమీద కొట్టి.. వేలల్లో ఇచ్చి లక్షల్లో గుంజుడు వీరి పద్దతి. అయితే ఇలాంటి వారికి కొంతలో కొంత చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అన్ని బ్యాంకులను లోన్ రికవరీ ఏజెంట్లతో తమ ప్రవర్తనను మెరుగుపరచుకోవాలని కోరింది. బ్యాంకు రుణాలు తీసుకునే ఖాతాదారుల వ్యక్తిగత డేటాతో బెదిరించడం.. వేధించడం, దుర్వినియోగం చేయడం వంటి సంఘటనలను నిరోధించేందుకు ప్రయత్నం చేసింది ఆర్బీఐ. ఈ మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్‌బీఐ కొత్త సర్క్యులర్‌ను కూడా జారీ చేసింది.
ప్రజలను వేధించకండి, రుణం తీసుకున్న వారి బంధువులు, పరిచయస్తులను వేధించే సంఘటనలను కూడా ఆపండి. అని ఏజెంట్లకు ఆర్‌బిఐ బ్యాంక్ ఆదేశించింది. ఈ సర్క్యులర్ అన్ని వాణిజ్య బ్యాంకులు, అన్ని బ్యాంకేతర ఆర్థిక కంపెనీలు, ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లు, అన్ని ప్రాథమిక పట్టణ సహకార సంస్థల కోసం అని ఆర్బీఐ ప్రత్యేకంగా గుర్తు చేసింది. బ్యాంకులకు (అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌లు) కూడా ఇది వర్తిస్తుంది.
అపవాదు మానుకుని..
బ్యాంకులు, ఇతర సంస్థలు సోషల్ మీడియాలో పరువు తీయడం, అభ్యంతరకరమైన సందేశాలు పంపే సంఘటనలను కూడా ఆపాలని ఆర్‌బీఐ ఆదేశించింది. గత కొద్ది నెలలుగా లోన్ యాప్‌ల కేసుల్లో రికవరీ ఏజెంట్లు ఏకపక్షంగా వ్యవహరించిన తీరుపై ఆర్బీఐ స్పందించింది.
కాల్ చేసేందుకు ఎంత సమయం..
నిబంధనల ప్రకారం ఉదయం 8 గంటలకు ముందు, సాయంత్రం 7 గంటల తర్వాత రికవరీ కోసం కస్టమర్‌లకు ఎట్టిపరిస్థితుల్లోకూడా కాల్ చేయవద్దని తాజా సర్క్యులర్‌లో RBI హెచ్చరించింది. ఎంటీటీలు రికవరీ ఏజెంట్ల తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది ఆర్బీఐ.
RBI సర్క్యులర్ ప్రకారం, బ్యాంకులు లేదా సంస్థలు, వారి ఏజెంట్లు సాధారణ ప్రజల నుంచి ఎలాంటి బెదిరింపులు లేదా వేధింపులకు దిగవద్దని ఆదేశించింది. వారి రుణాలను రికవరీ చేసే ప్రయత్నాలలో ఏ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ లేదా శారీరక, మానసిక దాడులకు ప్రయత్నిచవద్దని సూచించింది. కస్టమర్ నుంచి ఫిర్యాదు వస్తే దానిని చాలా సీరియస్‌గా తీసుకుంటామని RBI స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం