AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savings: ప్రతి నెలా రూ.7500 పొదుపుతో మీరూ కోటీశ్వరులు కావొచ్చు.. ఎలాగో తెలుసా?

ప్రతి వ్యక్తి సంపాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటారు. దీనిలో భాగంగా కొంతమంది అనేక రకాల మ్యూచ్ వల్ ఫండ్స్ ను ఎంచుకుంటారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు కావాలనుకునే వారు

Savings: ప్రతి నెలా రూ.7500 పొదుపుతో మీరూ కోటీశ్వరులు కావొచ్చు.. ఎలాగో తెలుసా?
NPS
Amarnadh Daneti
|

Updated on: Aug 13, 2022 | 1:13 PM

Share

Savings: ప్రతి వ్యక్తి సంపాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటారు. దీనిలో భాగంగా కొంతమంది అనేక రకాల మ్యూచ్ వల్ ఫండ్స్ ను ఎంచుకుంటారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు కావాలనుకునే వారు రిస్క్ అయినప్పటికి షేర్ మార్కెట్లో పెడతారు. కాని మనం చేసుకునే పొదుపుని ఓ ప్లాన్ ప్రకారం చేసుకుంటే 25 ఏళ్లలో మనం కోటీశ్వరువ్వచ్చు.. ఇదేలా అంటే.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ.. ముంబైకి చెందిన ఓ మ్చూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ తన ఆలోచనను వెల్లడిస్తూ.. హర్ గర్ తిరంగ నినాదాన్ని అనుసరిస్తూ.. తమ జీతంలో కొంత పొదుపు చేయాలనుకునేవారికి ఈక్విటీ మార్కెట్స్ లో హర్ ఘర్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) పేరుతో ఒక ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చారు.

హర్ గర్ తిరంగలో ప్రతి ఇంట్లో జాతీయ జెండాను ఎలా ఎగరవేస్తున్నామో.. అలాగే ప్రతి కుటుంబం ప్లాన్ ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే కోటీశ్వరులు ఎలా అవ్వచ్చో తెలిపారు. అయితే దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రజలను ఎలా ఒప్పించాలనే దానిపై ఒక ఆలోచన పంచుకుంటూ.. ప్రస్తుతం 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం.. అలాగే వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునేటప్పటికి నెలకు రూ.7500 చొప్పున చేసే పొదుపు మనల్ని కోటిశ్వరుడిని చేస్తుందన్నారు. నెలకు రూ.7500 పొదుపుచేస్తూ హర్ ఘర్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)ని ప్రారంభిస్తే 2047వ సంవత్సరం నాటికి కోటీశ్వరులుగా మారవచ్చు..

ఇదెలా అంటే.. నెలకు నూ.7500 చొప్పున 25 సంవత్సరాల్లో రూ.22లక్షల50 వేల మొత్తాన్ని పొదుపు చేయవచ్చు. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్ల ప్రకారం మీ పెట్టుబడులపై ఏడాదికి 12 శాతం రాబడి పొందగలిగితే స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి రూ.1కోటి27లక్షల రూపాయలు పొందవచ్చు. అదే రాబడి శాతం 15గా ఉంటే 2కోట్ల 7 లక్షల రూపాయలను పొందచ్చని ముంబైకి చెందిన మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ గణాంకాలను వివరించారు. ప్రస్తుతం ఖర్చులు పెరిగినప్పటికి.. ఖర్చుల ఆధారంగా ఆదాయం పెరుగుతుందని.. దీనిని దృష్టిలో పెట్టుకుని… ఇంట్లో అవసరాలకు, ఈఏంఐలకు నగదును వేరు చేసి మిగిలిన మొత్తంలో నెలకు రూ.7500 పొదుపు చేస్తే 25 ఏళ్లలో ఆపొదుపు మనల్ని కోటీశ్వరులని చేస్తోందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..