Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారిని అలా పిలిస్తే కఠిన చర్యలే..

AP News: నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి సామాజిక గౌరవానికి భంగం కలిగించే, కించపరిచే కొన్ని పదాలపై నిషేధం విధించింది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారిని అలా పిలిస్తే కఠిన చర్యలే..
AP Government
Follow us
Basha Shek

|

Updated on: Aug 11, 2022 | 8:26 AM

AP News: నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి సామాజిక గౌరవానికి భంగం కలిగించే, కించపరిచే కొన్ని పదాలపై నిషేధం విధించింది. మంగలి, మంగలోడా, మంగలిది, బొచ్చు గొరిగేవోడా, కొండ మంగలి తదితర పదాలను ఉపయోగిస్తే ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ పదాలతో పిలిస్తే నాయీబ్రాహ్మణుల మనోభావాలను గాయపరిచినట్లుగా భావిస్తామని ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యులపై కఠిన చర్యలకు వెనకాడేది లేదని హెచ్చరికలు జారీ చేసింది.

కాగా రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నారు సీఎం జగన్మోహన్‌ రెడ్డి. జగనన్న చేదోడు పథకం కింద వేలాది మంది నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం అందజేస్తోంది. అర్హులైన వారికి ఈ పథకం కింద ఏటా రూ.10వేల చొప్పున అందజేస్తోంది. అలా ఈ ఏడాది ఫిబ్రవరిలో జగనన్న చేదోడు పథకం రెండో విడతలో భాగంగా 40వేల మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40 కోట్ల నగదును వారి ఖాతాల్లో జమ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..