Income Tax Refund: ఆదాయపు పన్ను రీఫండ్ డబ్బు మీ ఖాతాలో జమ కాలేదా? ఈ చిన్న పొరపాట్లు కారణం కావచ్చు.. తెలుసుకోండి

Income Tax Refund: 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను దాఖలు గడువు జూలై 31 వరకు ముగిసిన విషయం తెలిసిందే. ఐటీఆర్‌ను సకాలంలో దాఖలు చేసి పన్ను రిఫండ్‌ను..

Income Tax Refund: ఆదాయపు పన్ను రీఫండ్ డబ్బు మీ ఖాతాలో జమ కాలేదా? ఈ చిన్న పొరపాట్లు కారణం కావచ్చు.. తెలుసుకోండి
Follow us
Subhash Goud

|

Updated on: Aug 13, 2022 | 1:49 PM

Income Tax Refund: 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను దాఖలు గడువు జూలై 31 వరకు ముగిసిన విషయం తెలిసిందే. ఐటీఆర్‌ను సకాలంలో దాఖలు చేసి పన్ను రిఫండ్‌ను క్లెయిమ్‌ చేసుకున్న వారు తమ ఖాతాలో డబ్బు జమ అయ్యే వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ చిన్న పొరపాటు వల్ల మీ ఫండ్‌ రీఫండ్‌ అయ్యే అవకాశం ఉండదు. అందుకే ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేసే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుని దరఖాస్తు చేయడం మంచిది. మీ ఆదాయపు పన్ను రీఫండ్‌ మీ ఖాతాలో జమ కాకపోతే పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోండి. మీ ఖాతాకు రీఫండ్‌ రాకపోతే పలు కారణాలు ఉంటాయి. అవి ఏంటంటే ఐటీఆర్‌ రిటర్న్‌ దాఖలు చేసినా పొరపాట్ల వల్ల ఐటీఆర్‌ చెల్లనిదిగా పరిగణిస్తుంది. అలాంటి సమయంలో మీకు రీఫండ్‌ రాదు. మీ ఐటీఆర్‌ ధృవీకరించకపోతే ప్రాసెసింగ్‌ కోసం ఐటీఆర్‌ తీసుకోదు. అలాగే దాఖలు చేసిన ఐటీఆర్‌ను అధికారులు ధృవీకరించకుంటే, లేదా ప్రాసెసింగ్‌లో ఉండి కన్ఫర్మేషన్‌ పొందనట్లయితే పన్ను వాసపు రాదు.

అలాగే గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి చెల్లించాల్సిన ట్యాక్స్‌ బాకీ ఉంటే కూడా ఆదాయపు పన్ను విభాగం రీఫండ్‌ చేసేందుకు నిరాకరిస్తుంది. ఇందు కోసం మీకు నోటీసులు జారీ చేస్తుంది. ఆ నోటీసుకు మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాధానం సరైనదిగా భావిస్తే అప్పుడు మీ ఆదాయపు పన్ను బాకీ పోను మొత్తం రీఫండ్‌ చేస్తుంది. ఎప్పుడైనా సరే రిటర్నులు దాఖలు చేసే సమయంలో బ్యాంకు వివరాలలో ఎలాంటి తప్పులు ఉన్నా.. మీ ఖాతాలో రీఫండ్‌ జమ కాకపోవచ్చు. దాఖలు చేసే ముందు అన్ని వివరాలు సరి చూసుకోవడం మంచిది.

ఐటీఆర్‌ రిటర్నులు చేసేటప్పుడు ముందుగానే సరి చూసుకోవడం ఎంతో ముఖ్యం. అవేమి చూడకుండా దాఖలు చేసిన తర్వాత ఏవైనా తప్పులుంటే మీకు రీఫండ్‌ రాదు. మీరు రిటర్న్‌లు ఫైల్‌ చేసిన నాలుగు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తికాకపోతే మీరు ఏదో పొరపాటు చేసిన కారణంగా ఐటీఆర్‌ ధృవీకరణ కాలేదని భావించాలి. అందుకు ఐటీఆర్‌ రిటర్నులు దాఖలు చేసే ముందు అన్ని వివరాలు జాగ్రత్తగా పూరించాలి. లేకపోతే మీకు రీఫండ్‌ రాకపోవడమే కాకుండా ఆదాయపు పన్ను అధికారుల నుంచి నోటీసులు కూడా వస్తాయి. అలాంటి సమయంలో మీరు సమయం వృథా చేసుకోవడమే కాకుండా ఇబ్బందులు పడుతూ పెనాల్టీలు చెల్లించుకోక తప్పదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి