Godavari Water Flow: మళ్లీ ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. ధవలేశ్వరం కాటన్ బ్యారజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. తూర్పుగోదారి జిల్లా ధవలేశ్వరం సర్.ఆర్ధర్ కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13,75 అడుగులుగా ఉంది. దీంతో రెండో
Godavari Water Flow: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. తూర్పుగోదారి జిల్లా ధవలేశ్వరం సర్.ఆర్ధర్ కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13,75 అడుగులుగా ఉంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.19 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు. 13లక్షల16వందల38 క్యూ సే క్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉపనదులు పొంగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజమహేంద్రవరంలోని గోదావరి ఘాట్లను మూసివేశారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. ముంపు ప్రాంతాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 ఎన్డీఆర్ ఎఫ్, 3 ఎస్టీఆర్ ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలోఎన్డీఆర్ ఎఫ్, అమలాపురంలో 2 ఎస్టీఆర్ ఎఫ్ బృందాలు మొహరించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఎన్డీఆర్ ఎఫ్, విఆర్ పురంలో ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారలు తెలిపారు. మరోవైపు తెలంగాణలోని భద్రాచలం వద్ద బుధవారం గోదావరి ఉధృతి కాస్త తగ్గగా… ఈరోజు మళ్లీ గోదావరి నీటిమట్టం 52 అడుగులకు చేరింది. మూడవ ప్రమాద హెచ్చరికకు చేరువలో నీటిమట్టం ఉండటంతో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పర్యటన: ఉమ్మడి తూర్పుగోదాడవరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. కేంద్ర హోమంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు రవినేష్ కుమార్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన రెండు బృందాలు పర్యటిస్తున్నాయి. బుధవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో ఒక్కొక్క బృందం చొప్పున పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేశారు. గురువారం కోనసీమ జిల్లాలో రెండు బృందాలు పర్యటిస్తున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. ఆయా ప్రాంతాల్లో పాడైన పంటపొలాలను పరిశీలిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈకేంద్రబృందాలు సమావేశమవుతాయి. తమ పర్యటనలో వెలుగుచూసిన అంశాలు, వాస్తవ నష్టాన్ని కేంద్రప్రభుత్వానికి కేంద్రబృందాలు నివేదిస్తాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..