అమీర్‌ ఖాన్‌.. మీరు ఆగస్టు 15 తర్వాతే మా రాష్ట్రాన్ని సందర్శించండి: అస్సాం ముఖ్యమంత్రి

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' వివాదం ఇప్పట్లో సర్దుమనిగేలా కనిపంచడం లేదు. తాజాగా అస్సాంలో జరగనున్న స్వాతంత్ర్య వేడుకల్లో..

అమీర్‌ ఖాన్‌.. మీరు ఆగస్టు 15 తర్వాతే మా రాష్ట్రాన్ని సందర్శించండి: అస్సాం ముఖ్యమంత్రి
Himanta Biswa Sarma
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 13, 2022 | 10:11 AM

Why Chief Minister Himanta Sarma Asked Aamir Khan To Postpone Assam Visit: బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ వివాదం ఇప్పట్లో సర్దుమనిగేలా కనిపంచడం లేదు. తాజాగా అస్సాంలో జరగనున్న స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా తమ రాష్ట్రాన్ని ఆగస్టు 15 తర్వాత మాత్రమే అమీర్‌ఖాన్‌ సందర్శదించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు. ఈ మేరకు అస్సాం రాష్ట్ర సందర్శనను వాయిదా వేసుకోవాలని శుక్రవారం (ఆగస్టు 12) గువాహటిలో మీడియా సమక్షంలో సీఎం హిమంత కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ఈ విధంగా మాట్లాడారు.. ‘అమీర్ ఖాన్ ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడాలనుకున్నారు. కానీ ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రస్తుత సమయంలో మా ఫోకస్‌ పక్కదారి పట్టకూదని భావిస్తున్నాం. అందుకే అమీర్‌ఖాన్‌ను తన పర్యటనను వాయిదా వేసుకుని స్వాతంత్ర్య దినోత్సవం అనంతరం రాష్ట్రంలో పర్యటించాలని కోరుతున్నామన్నాం. ఆయనతో నేను ఫోన్‌లో ఎప్పుడూ టచ్‌లో ఉంటాను. నేను ఆహ్వానించినప్పుడల్లా అతను వస్తుంటాడని’ హిమంత బిశ్వ శర్మ తెలిపారు. కాగా ఇటీవల అస్సాంలో సంభవించిన వరదలకు అమీర్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 25 లక్షలు విరాళాలు అందించినట్లు జూన్ 27 న హిమంత బిస్వా శర్మ ట్వీట్ చేశారు. సీఎంతోపాటు ప్రజల నుంచి ఎన్నో ప్రశంసలు కూడా పొందారు. అమీర్‌ఖాన్‌ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందుగా అంటే ఆగస్టు 14వ తేదీన తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా అస్సాం రాష్ట్రానికి వెళ్లాలని అనుకున్నారు. ఐతే ఆ రాష్ట్ర సీఎం అభ్యర్ధన మేరకు ఈ పర్యటన ఆగస్టు 16కు వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా అమీర్‌ నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ గత కొన్ని రోజులుగా పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇండియన్ ఆర్మీని అగౌరవ పరిచేలా ఉందంటూ, ఈ సినిమాను బ్యాన్‌ చేయాలని కొందరు పిలుపునిచ్చారు. దీంతో అమీర్‌ ఖాన్‌పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.