DMHO West Godavari Jobs: టెన్త్/ఐటీఐ అర్హతతో.. పశ్చిమ గోదావరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (DMHO West Godavari).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం 237 మెడికల్ స్టాఫ్ పోస్టుల (Para Medical Staff Posts) భర్తీకి అర్హులైన..
DMHO West Godavari Para Medical Staff Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (DMHO West Godavari).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం 237 మెడికల్ స్టాఫ్ పోస్టుల (Para Medical Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెన్త్ క్లాస్, పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ఇంటర్మీడియట్/ఎసీఏ/బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/బీఎస్సీ/డిప్లొమా/డీఫార్మసీ/బీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు జులై 1, 2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు ఆగస్టు 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుముగా జనరల్ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.250లు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్సీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. పోస్టును బట్టి నెలకు రూ.15,000ల నుంచి రూ.37,640ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శంచవచ్చు.
ఖాళీల వివరాలు:
- ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 9
- ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 9
- ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు: 10
- శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్ పోస్టులు: 13
- రేడియోగ్రాఫర్ పోస్టులు: 3
- ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 11
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు: 11
- ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ పోస్టులు: 6
- ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 1
- ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 2
- జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు: 08
- ప్లంబర్ పోస్టులు: 5
- అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు: 10
- ఆడియో విజువల్ టెక్నీషియన్ పోస్టులు: 1
- బయో మెడికల్ టెక్నీషియన్ పోస్టులు: 3
- రేడియోగ్రాఫర్ పోస్టులు: 1
- ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 3
- ఎలక్ట్రీషియన్ పోస్టులు: 4
- ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులు: 10
- జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు: 53
- మెడికల్ రికార్డ్ టెక్నీషియన్/ అసిస్టెంట్ పోస్టులు: 2
- ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 11
- ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 15
- లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు: 4
- మార్చురీ అటెండెంట్ పోస్టులు: 5
- ఓటీ టెక్నీషియన్ పోస్టులు: 5
- ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 8
- ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 6
- ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 1
- ప్లంబర్ పోస్టులు: 3
- స్టోర్ అటెండర్ పోస్టులు: 4
అడ్రస్: District Medical and Health Office, Eluru, West Godavari District, AP.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.