DMHO Kurnool Recruitment 2022: టెన్త్/ఇంటర్ అర్హతతో కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (DH), ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కింద వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో..
DMHO Kurnool Para Medical Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (DH), ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కింద వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం 129 పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల (Para Medical Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. అకడమిక్ మెరిట్ మార్కులు, సంబంధిత పనిలో అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు ఆగస్టు 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా జనరల్ అభ్యర్ధులు రూ.250లు తప్పనిసరిగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. పోస్టును బట్టి నెలకు రూ.15,000ల నుంచి రూ.54,060ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఖాళీల వివరాలు:
- ఆడియోమెట్రీ టెక్నీషియన్ పోస్టులు: 4
- కౌన్సెలర్/ ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్-2 పోస్టులు: 4
- డైటీషియన్ పోస్టులు: 1
- రేడియోగ్రాఫర్ పోస్టులు: 16
- ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 4
- ఎలక్ట్రీషియన్ పోస్టులు: 5
- జనరల్ డ్యూటీ అటెండెంట్లు పోస్టులు: 32
- మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టులు: 2
- ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 6
- ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 20
- ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 21
- ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్/ రిఫ్రాక్షనిస్ట్ పోస్టులు: 3
- పెర్ఫ్యూషనిస్ట్ పోస్టులు: 2
- న్యూక్లియర్ ఫిజిసిస్ట్ పోస్టులు: 1
- ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 1
- ప్లంబర్ పోస్టులు: 3
- శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్ పోస్టులు: 4
అడ్రస్: District Medical and Health Office, Kurnool District, AP.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.