AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBI Recruitment 2022: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీజనల్ ఆఫీస్.. ఒప్పంద ప్రాతిపదికన ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌..

CBI Recruitment 2022: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
Central Bank Of India
Srilakshmi C
|

Updated on: Aug 13, 2022 | 8:04 AM

Share

Central Bank of India Office Assistant Recruitment 2022: మహారాష్ట్రకు చెందిన నాసిక్‌లోనున్న సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీజనల్ ఆఫీస్.. ఒప్పంద ప్రాతిపదికన ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఎస్‌డబ్ల్యూ/బీఏ/బీకాం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలతోపాటు కంప్యూటర్, బేసిక్‌ అకౌంట్స్‌, బుక్ కీపింగ్‌పై పట్టు ఉండాలి. అలాగే దరఖాస్తు దారలు వయసు 18 నుంచి 35 యేళ్ల ఉండాలి. పై ఆర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు ఆగస్టు 30, 2022లోపు దరఖాస్తులు పంపవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.12000ల చొప్పున జీతంతో ఉద్యోగావకాశం కల్పిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.

అడ్రస్: ‘Regional Manager, Central Bank of India, Regional Office, P-63, Near Glenmark company, MIDC Satpur Nashik-422007’.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.