Karnataka: కోరిక తీరిస్తేనే మహిళలకు ప్రభుత్వ ఉద్యోగమట.. బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు..
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ చిత్తాపుర్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కర్ణాటకలో అబ్బయిలు లంచాలు, అమ్మాయిలైతే అధికారుల శారీరక కోరిక తీర్చాల్సి వస్తోందని
Karnataka: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ చిత్తాపుర్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కర్ణాటకలో అబ్బయిలు లంచాలు, అమ్మాయిలైతే అధికారుల శారీరక కోరిక తీర్చాల్సి వస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈఆరోపణలకు సంబంధించి ప్రియాంక్ ఖర్గే ఎటువంటి ఆధారాలను మీడియాకు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో జరిగిన కుంభకోణంపై సిట్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ నియమాకాల్లో ఎన్నో అక్రమలు జరిగాయని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్ని బీజేపీ ప్రభుత్వం సేల్ చేస్తోందన్నారు. అలాగే ఒక మహిళలకు ఉద్యోగం రావాలంటే తనతో పడుకోవాలని ఓ మంత్రి అడిగారని.. ఈవిషయం ఆధారాలతో బయటకు రావడంతో ఆ మంత్రి రాజీనామా చేశారని ఈసందర్భంగా గుర్తు చేశారు.
ఇటీవల కర్ణాటక పవ్ ట్రాన్స్ మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్ లో 1492 ఉద్యోగాలను భర్తీ చేశారని.. ఈప్రక్రియలోనూ ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలో ఓ అభ్యర్థి బ్లూటూత్ పెట్టుకుని పరీక్ష రాస్తుండగా దొరికిపోయాడని.. ఇవ్వన్నీ అధికారుల ప్రమేయంతోనే జరుగుతుందన్నారు. 1492 ఉద్యోగాల్లో 600 ఉద్యోగాలు అమ్ముకునేందుకు ఒప్పందం జరిగిందంటూ ఆరోపించారు ప్రియాంక ఖర్గే, అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగానికి రూ.50 లక్షలు, జూనియర్ ఇంజినీర్ ఉద్యోగానికి రూ.30 లక్షలుగా డిసైట్ చేసి రూ.300 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో కర్ణాటక ప్రభుత్వం ఆడుకుంటోదని… దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కుమారుడే ప్రియాంక్ ఖర్గే.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..