Beauty tips: పెదవులు లేత పింక్‌ కలర్‌లో మెరిసిపోవాలంటే.. రోజూ ఇలా చేయండి..

లిప్‌ స్టిక్‌ వేసుకోవడం వల్ల పెదవులు నల్లగా మారి, అందవిహీణంగా కనిపిస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అతిగా లిప్‌ స్టిక్‌ వాడటం వల్ల పెదవుల రంగు నల్లబడుతుంది. లిప్‌ స్టిక్‌ కారణంగానే కాకుండా సాధారణంగా అనేక మంది పెదవులు..

Beauty tips: పెదవులు లేత పింక్‌ కలర్‌లో మెరిసిపోవాలంటే.. రోజూ ఇలా చేయండి..
Lip Care
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 13, 2022 | 12:48 PM

How to get pink lips naturally: లిప్‌ స్టిక్‌ వేసుకోవడం వల్ల పెదవులు నల్లగా మారి, అందవిహీణంగా కనిపిస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అతిగా లిప్‌ స్టిక్‌ వాడటం వల్ల పెదవుల రంగు నల్లబడుతుంది. లిప్‌ స్టిక్‌ కారణంగానే కాకుండా సాధారణంగా అనేక మంది పెదవులు ముదురు లేదా లేత నలుపు రంగులో చుట్టూ వలయంలా ఏర్పడుతుంది. అందుకు జీవనశైలి అలవాట్లు, వ్యాధులు కూడా కారణంకావచ్చు. అలాగే ధూమపానం, మందుల దుష్ప్రభావాలు, అలర్జీలు, జలుబు, విటమిన్ లోపం, రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం మొదలైన ఇతర కారణాల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. పెదవులు సహజంగా ఎర్రగా మెరవాలంటే ఈ విధంగా చెయ్యండి..

లిప్‌ స్క్రబ్ పెదవులపై ఉన్న డెడ్ స్కిన్‌ను తొలగించేందుకు.. తేనె, బాదం నూనెను సమాన పరిమాణంలో కలుపుకుని దానిలో కొంచెం చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేసి నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం మూలంగా పెదాలు మృదువుగా మారి, క్రమంగా లేత పింక్‌ కలర్‌లోకి మారుతాయి.

ఈ జాగ్రత్తలు అవసరం..

ఇవి కూడా చదవండి
  • శరీరానికి, చర్మానికి పోషణ ఎంత అవసరమో, పెదాలకు కూడా అంతే అవసరం. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు పెదాలకు అలోవెరా జెల్ రాసి మసాజ్ చేసుకోవాలి. తర్వాత నాణ్యత కలిగిన మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను అప్లై చెయ్యాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి.
  • నిద్రపోయేముందు క్రీమ్ రాసుకోవడం వల్ల పెదాల రంగుపై చాలా ప్రభావం చూపుతుందని సౌందర్య నిపుణులు అంటున్నారు. క్రీమ్ పెదాలను పింక్‌గా, మృదువుగా మార్చుతుంది.
  • దీనితోపాటు రోజు మొత్తంలో తగినంత నీరు తాగకపోయినా పెదవుల రంగు మారిపోతుంది. ఫలితంగా పెదవులు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తాయి. కాబట్టి రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల చాలా పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి నీరు అధికంగా తాగడం అలవాటు చేసుకోవాలి.
  • పొగతాగే అలవాటున్నవారు వెంటనే మానేయడం బెటర్‌. లేకపోతే మీ సమస్య ఎప్పటికీ సమస్యగానే మిగిలిపోతుంది. అదేవిధంగా నాణ్యమైన లిప్‌స్టిక్‌లను ఎంపిక చేసుకోవడం మర్చపోకూడదు.