Agneepath Scheme: విశాఖ వేదికగా అగ్నివీర్‌ల నియామకానికి రంగం సిద్ధం.. నేటి నుంచి 18 రోజులపాటు రిక్రూట్‌మెంట్‌

  విశాఖలో జరిగే అగ్నివీర్ రిక్రూట్మెంట్ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 300 మందికి పైగా ఆర్మీ అధికారులు, సిబ్బందితో పాటు.. 500 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు

Agneepath Scheme: విశాఖ వేదికగా అగ్నివీర్‌ల నియామకానికి రంగం సిద్ధం.. నేటి నుంచి 18 రోజులపాటు రిక్రూట్‌మెంట్‌
Agnipath Scheme
Follow us

|

Updated on: Aug 14, 2022 | 5:59 AM

Agneepath Scheme: అగ్నివీర్‌ల నియామకానికి రంగం సిద్ధమైంది. విశాఖ పట్నం ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వేదికగా రిక్రూట్‌మెంట్‌ ప్రారంభమైంది.అభ్యర్థులు పెద్దసంఖ్యలో రాత్రే విశాఖ చేరుకున్నారు. విశాఖలో 18 రోజులపాటు అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ జరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచి ఈనెల 31వ తేదీ వరకు అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఏపీలోని శ్రీకాకుళం, ఎన్టీఆర్‌జిల్లాలకు చెందిన వారితోపాటు..యానాంకు చెందిన అభ్యర్థులు కూడా రిక్రూట్‌మెంట్‌కు కేటాయించిన తేదీలవారీగా హాజరవుతున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో తొలిరోజు రిక్రూట్‌మెంట్‌ కోసం అడ్మిట్‌కార్డులు పొందిన అభ్యర్థులు నిన్న రాత్రే విశాఖలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి చేరుకున్నారు. రాత్రంతా స్టేడియం పరిసరాల్లోనే అభ్యర్థులు నిద్రపోయారు.

విశాఖలో జరిగే అగ్నివీర్ రిక్రూట్మెంట్ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 300 మందికి పైగా ఆర్మీ అధికారులు, సిబ్బందితో పాటు.. 500 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వీరికితోడు మెడికల్, రెవెన్యూ సిబ్బంది అదనంగా ఉన్నారు. పరీక్షలు జరిగే స్టేడియంలోపల, భ్యర్థులు వచ్చే మార్గాల్లో భారీకేడ్లను ఏర్పాటు చేశారు.

అభ్యర్థులకోసం ఎక్కడికక్కడ సమాచారం తెలిపే ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో పోలీస్‌, రెవెన్యూ మెడికల్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రిక్రూట్‌మెంట్‌ పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నారు ఆర్మీ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్నికెరీర్ & ఉద్యోగాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..