Domestic violence: పిల్లల ముందు ఈ పనులు చేస్తున్నారా? ఐతే జాగ్రత్త.. వారి భవిష్యత్తు చీకటిమయం చేస్తున్నది మీరే..

కుటుంబంలో అడపాదడపా కలహాలు రేగడం సాధారణమే. ఐతే అవి శృతి మించితేనే ప్రమాదం. అందునా భార్యభర్తలు కలహాలు పడని ఇళ్లు..

Domestic violence: పిల్లల ముందు ఈ పనులు చేస్తున్నారా? ఐతే జాగ్రత్త.. వారి భవిష్యత్తు చీకటిమయం చేస్తున్నది మీరే..
Children Mental Health
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 13, 2022 | 12:08 PM

Effects of domestic violence on children: కుటుంబంలో అడపాదడపా కలహాలు రేగడం సాధారణమే. ఐతే అవి శృతి మించితేనే ప్రమాదం. అందునా భార్యభర్తలు కలహాలు పడని ఇళ్లు ఉండవంటే అతిశయోక్తి కాదేమో! సెంటిమెంట్లు, సమస్యలు, ఏడుపులు, పెడబొబ్బలు.. ఇలాంటివి పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కుటుంబ కలహాలు లేదా హింస పిల్లల మనస్సుపై చెరిగిపోని ముద్రవేస్తాయి. వారి మనసు దీర్ఘకాలిక గాయాలకు గురవుతుంది. ఎదిగే పిల్లలో ఏకాగ్రత లోపించి, వారిలో కోపం విపరీతంగా పెరుగుతుందని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. 10-12 యేళ్లపాటు ఈ విధమైన కల్లోల వాతావరణంలో పెరిగిన పిల్లలు అభద్రతా భావంతో ఉంటారు.

అంతేకాకుండా పిల్లల దైనందిన కార్యకలాపాలు ప్రభావితం అవుతాయి. ఇంట్లో నిరంతరం తల్లిదండ్రులతో సంఘర్షణ పడటం, చీటికిమాటికి కోప్పడటం వంటి చేస్తారు. అలాగే ఆందోళన, ఒత్తిడి కారణంగా పాఠశాలకు వెళ్లేందుకు వెనుకాడతారు. కుటుంబ కలహాలు, గృహ హింస కారణంగా పిల్లలు శారీరకంగా, మానసికంగా ప్రభావితమవుతారు. మీ పిల్లల్లో ఈ విధమైన లక్షణాలు కనిపిస్తే.. వారి బంగారు భవిష్యత్తు కోసం మీ ప్రవర్తనను మార్చుకోవడం మంచిది. వారి ముందు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన సంభాషణ చేయడం, వారిలోని భయాలగి పోయేలా ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూసుకోవాలి.