AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Sleep: పడుకోగానే హాయిగా నిద్రపట్టాలంటే రోజూ ఇలా చేయండి..

ఈ రోజుల్లో జీవనశైలి, తినే ఆహారం, పనుల ఒత్తిడి కారణంగా చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. పడుకున్న వెంటనే నిద్ర పట్టకపోవడం వల్ల ఎంతో మంది ట్యాబ్లెట్స్‌ను ఆశ్రయిస్తున్నారు కూడా. కంటికి సరిపడా నిద్రలేకపోతే మానసిక, శారీరక ఆరోగ్యం..

Healthy Sleep: పడుకోగానే హాయిగా నిద్రపట్టాలంటే రోజూ ఇలా చేయండి..
Healthy Sleep
Srilakshmi C
|

Updated on: Aug 14, 2022 | 1:26 PM

Share

How to sleep better at night naturally: ఈ రోజుల్లో జీవనశైలి, తినే ఆహారం, పనుల ఒత్తిడి కారణంగా చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. పడుకున్న వెంటనే నిద్ర పట్టకపోవడం వల్ల ఎంతో మంది ట్యాబ్లెట్స్‌ను ఆశ్రయిస్తున్నారు కూడా. కంటికి సరిపడా నిద్రలేకపోతే మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. రాత్రంతా హాయిగా నిద్రపోతే బాగా రోజంతా ఉత్సాహంగా ఉంటారనేది కాదనలేని వాస్తవం. నిద్రలేమి సమస్య మిమ్మల్ని కూడా వేధిస్తున్నట్లయితే ఈ విధంగా చేయండి..

  • పడుకునే ముందు కెఫిన్‌తో కూడిన పదార్థాలు తీసుకోవడం మానుకోవాలి. అలాగే ధూమపానం, మద్యానికి దూరంగా ఉండాలి. ఎక్కువగా తినకూడదు.
  • రాత్రి పడుకున్న తర్వాత నిద్రలేకపోతే, ఆలోచిస్తూ ఉండకుండా మంచి సంగీతం వినడం అలవాటే చేసుకోవాలి.
  • వీలైనంత వరకు పగటి నిద్రలకు దూరంగా ఉండాలి. అలాగే నిద్ర సమయంలో గది చీకటిగా ఉండేలా చూసుకోవాలి.
  • ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ రాత్రి 10:00 మరియు 11:00 PM మధ్య నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
  • బాగా నిద్రపట్టడానికి వెచ్చని నువ్వుల నూనెతో పాదాలను మసాజ్ చేసుకోవాలి. దీనినే ‘పాదాభ్యంగం’ అంటారు.
  • పడుకునేటప్పుడు వదులుగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరించాలి. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్రపోవడానికి అనుకూలంగా ఉంటాయి.
  • ప్రతి రోజూ బాగా నిద్రపోతే చిరాకు, ఆందోళన, ఆందోళనకు గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. నిద్రలేమిని భర్తీ చేయడానికి సెలవు రోజుల్లో చాలా మంది రోజంతా నిద్రపోతుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. దీని వల్ల బద్దకం అలవడుతుంది.