AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Almond Benefits: మీకు బాదం పప్పు తినే అలవాటుందా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి..

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరపడా విటమిన్లు, మినరల్స్‌, పోషకాలు అవసరం. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం వాత, పిత్త, కఫా సమతుల్యతలో ఉన్నప్పుడు మాత్రమే శరీరం సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటుంది. వీటిల్లో ఏది..

Almond Benefits: మీకు బాదం పప్పు తినే అలవాటుందా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి..
Almonds
Srilakshmi C
|

Updated on: Aug 14, 2022 | 12:44 PM

Share

Health Benefits Of Almonds: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరపడా విటమిన్లు, మినరల్స్‌, పోషకాలు అవసరం. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం వాత, పిత్త, కఫా సమతుల్యతలో ఉన్నప్పుడు మాత్రమే శరీరం సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటుంది. వీటిల్లో ఏదైనా అసమతుల్యత సంభవిస్తే అనారోగ్య సమస్యలు దాపురిస్తాయి. పోషకాలు పుష్కలంగా కలిగిన బాదంపప్పును రోజూ తీసుకోవడం వల్ల వాత, పిత్త దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ బాదంపప్పును తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ విశాఖ మహింద్రు మాటల్లో మీకోసం..

నానబెట్టిన బాదంపప్పును తీసుకోవడం వల్ల మధుమేహం వల్ల సంభవించే బలహీనతల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆయుర్వేదం ప్రకారం.. స్థూలకాయం, ప్రీడయాబెటిస్ మెటబాలిక్ సిండ్రోమ్ వంటి రుగ్మతలను అధిగమించడంలో బాదం సహాయపడుతుంది.

ఆయుర్వేదం ప్రకారం.. బాదంపప్పును రోజూ తీసుకోవడం వల్ల శరీర కణజాలాలకు అవసరమైన తేమను అందిస్తుంది. చర్మం రంగును మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కూడా బాదం సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతిరోజూ బాదంపప్పును తీసుకోవాలి. బాదంపప్పు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

క్రమం తప్పకుండా బాదం తింటే బరువు పెరగడానికి ఉపకరిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం బాదంలో శరీర ద్రవ్యరాశి, బలాన్ని పెంచే సామర్థ్యం కలిగి ఉంటుంది.