Makhana Health Benefits: పూల్ మఖానా తింటున్నారా? గుండె జబ్బులు, షుగర్, బీపీ ఇంకా..
మఖానాలో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫాస్పరస్, ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మఖానాల్లో..
Phool makhana nutrition: పూల్ మఖానా లేదా తామర గింజలు లేదా ఫాక్స్‌నట్స్‌లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయని మీకు తెలుసా? మఖానాలో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫాస్పరస్, ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మఖానాల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిల్లో ఎముకలకు మేలు చేసే కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో, జీర్ణ క్రియ మెరుగుపరచడంలో కూడా ఎంతో ఉపయోగపడతాయి. వీటితోపాటు ఈ కింది ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..
గుండె ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్
శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటే గుండె జబ్బుల ప్రమాదం అధికంగా ఉంటే అవకాశం ఉంది. మఖానాల్లో తక్కువ మొత్తంలో ఉండే సోడియం, అధిక మొత్తంలో ఉండే పొటాషియం రక్తపోటుతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తాయి. సోడియం తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్లజర్ అదుపులో ఉంటుంది. వీటిల్లోని మెగ్నీషియం శరీరంలోని రక్తం, ఆక్సిజన్ క్వాలిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఎముకలకు పుష్టి
ఎము్లె ఆరోగ్యంగా ఉంచడంలో కాల్షియం పాత్ర కీలకం. మఖానాలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడమేకాకుండా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రోటీన్లు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంటారు. అటువంటి వారికి మఖానా మంచి ఎంపిక. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచేలా చేస్తాయి. వీటిల్లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది..
మఖానాలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాల్లో ఇవి కూడా ఒకటి. వీటిల్లోని మెగ్నీషియం అధికంగా, సోడియం కంటెంట్ తక్కువగా ఉండటం మూలంగా ఊబకాయం, మధుమేహంతో బాధపడేవారు నిరభ్యంతరంగా తినవచ్చు.
జీర్ణక్రియ మెరుగుదలకు..
వీటిల్లోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది. అంతేకాకుండా వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని దరిచేరకుండా చేసి, యవ్వనంగా ఉంచుతాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. మఖానాలో థయామిన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా తీసకుంటే కాగ్నిటివ్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది.