Jeera Water Benefits: జీరా వాటర్‌తో ఎన్ని లాభాలో తెలుసా.. ఊబకాయంతో పాటు ఆ సమస్యలకు చెక్‌

Health Care Tips: జీలకర్రలో పలు ఆరోగ్య పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్య, తలనొప్పి, వికారం లేదా ఇతర జీర్ణ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తాయి.

Jeera Water Benefits: జీరా వాటర్‌తో ఎన్ని లాభాలో తెలుసా.. ఊబకాయంతో పాటు ఆ సమస్యలకు చెక్‌
Benefits Of Jeera Water
Follow us
Basha Shek

|

Updated on: Aug 15, 2022 | 10:00 AM

Health Care Tips: జీలకర్రలో పలు ఆరోగ్య పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్య, తలనొప్పి, వికారం లేదా ఇతర జీర్ణ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తాయి. ముఖ్యంగా జీలకర్రలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉంటాయి. జీలకర్రను రాత్రి నానబెట్టి, ఉదయం అదే నీటిలో ఎక్కువ నీరు కలుపుకుని టీలాగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీలకర్రలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే జీలకర్రలో ఉండే మెగ్నీషియం, కాల్షియం ఇతర ఖనిజాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాపును తగ్గిస్తుంది

కాలేయం సమస్యల నుంచి

జీలకర్రను నీటిలో మరిగించి ఆ నీటిని తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు దూరమవుతాయి. ఉదర సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ తదితర జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఇది మంచి ఆహారం.

ఇవి కూడా చదవండి

ముడతలు తగ్గేందుకు..

జీలకర్రలో ఉండే విటమిన్‌-ఇ చర్మం ఆరోగ్యానికి సహకరిస్తుంది. ముఖ్యంగా ముఖంలో ముడతలను మాయం మరిగించిన జీలకర్ర నీటిలో క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, సెలీనియం తదితర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నీటిని తాగితే ముఖంపై ముడతలు పోతాయి. అలాగే మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతాయి.

జీర్ణశక్తిని పెంచుతాయి..

జీలకర్రకు జీర్ణశక్తిని పెంచే శక్తి ఉంది. రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు బాధించవు. ఇక ఇందులోని లక్షణాలు కొవ్వును కరిగించడంలో సహాయపడుతాయి. ఇక కాలేయంలో బైల్ యాసిడ్ ఉత్పత్తి ప్రక్రియను బలపరుస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..
సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..
మీకు ఉద్యోగం లేకున్నా.. సులభంగా వ్యక్తిగత రుణం పొందవచ్చు..!
మీకు ఉద్యోగం లేకున్నా.. సులభంగా వ్యక్తిగత రుణం పొందవచ్చు..!
అరె.! ఏంట్రా ఇది.. మగ టీచర్‌కు ప్రసూతి సెలవులు..నవ్వుకుంటున్న జనం
అరె.! ఏంట్రా ఇది.. మగ టీచర్‌కు ప్రసూతి సెలవులు..నవ్వుకుంటున్న జనం
'సినిమాలను వదిలేయాలనుకుంటున్నా'! సుకుమార్ షాకింగ్ కామెంట్స్
'సినిమాలను వదిలేయాలనుకుంటున్నా'! సుకుమార్ షాకింగ్ కామెంట్స్
ఆ ఈవీలకు గట్టిపోటీ తప్పదా..? మార్కెట్‌‌లోకి బజాజ్‌ స్కూటర్‌
ఆ ఈవీలకు గట్టిపోటీ తప్పదా..? మార్కెట్‌‌లోకి బజాజ్‌ స్కూటర్‌
అల్లు అర్జున్ అరెస్ట్‌పై జానీ మాస్టర్ ఏమన్నాడంటే.? రియాక్షన్ ఇదే
అల్లు అర్జున్ అరెస్ట్‌పై జానీ మాస్టర్ ఏమన్నాడంటే.? రియాక్షన్ ఇదే
పుష్ప2 చూసేందుకు పోయి.. పోలీసులకు అడ్డంగా దొరికిన స్మగ్లర్
పుష్ప2 చూసేందుకు పోయి.. పోలీసులకు అడ్డంగా దొరికిన స్మగ్లర్
పెళ్లి చేసుకుని ఒక్కటైన.. ఇద్దరు యువ‌తులు !!
పెళ్లి చేసుకుని ఒక్కటైన.. ఇద్దరు యువ‌తులు !!
అయోధ్య బాలరాముడిదే 1st ప్లేస్.. 2వ స్థానంలో తాజ్ మహల్
అయోధ్య బాలరాముడిదే 1st ప్లేస్.. 2వ స్థానంలో తాజ్ మహల్
రాత్రి పడుకునేముందు ఇవి రాస్తే ఉదయానికే ఫేషియల్ లుక్..
రాత్రి పడుకునేముందు ఇవి రాస్తే ఉదయానికే ఫేషియల్ లుక్..