AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Steel Plant Jobs 2022: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో 319 ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? 2 రోజులే గడువు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (Vizag Steel Plant)లో 319 ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇక రెండు రోజులే వ్యవధి ఉంది. ఇప్పటి వరకు..

Vizag Steel Plant Jobs 2022: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో 319 ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? 2 రోజులే గడువు..
Vizag Steel Plant
Srilakshmi C
|

Updated on: Aug 15, 2022 | 7:29 AM

Share

Vizag Steel Plant Trade Apprentice Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (Vizag Steel Plant)లో 319 ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇక రెండు రోజులే వ్యవధి ఉంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు ఇది చివరి అవకాశం. ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 18, 2022 సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలేవంటే.. పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ/ఎన్‌సీబీటీ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ లేదా తత్సమాన కోర్సులో అర్హతలున్నవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వయోపరిమితి (వయసు) ఏప్రిల్‌ 1, 2022 నాటికి ఖచ్చితంగా 18 నుంచి 25 యేళ్ల మధ్య మాత్రమే ఉండాలి. దరఖాస్తు రుసుముగా జనరల్ అభ్యర్ధులు రూ.200లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులు రూ.100లు చెల్లించాలి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 150 మార్కులకుగాను పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్‌ ఉండదు.

ఖాళీల వివరాలు..

  • ఫిట్టర్ పోస్టులు: 80
  • టర్నర్ పోస్టులు: 10
  • మెషినిస్ట్ పోస్టులు: 14
  • వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) పోస్టులు: 40
  • మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ (MMTM) పోస్టులు: 20
  • ఎలక్ట్రీషియన్ పోస్టులు: 65
  • వడ్రంగి పోస్టులు: 20
  • మెకానిక్ రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ (R & AC) పోస్టులు: 10
  • మెకానిక్ డీజిల్ పోస్టులు: 30
  • కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్ట్ (COPA) పోస్టులు: 30

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.