Army AFMS Recruitment 2022: ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌లో 420 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (Army AFMS).. 420 మెడికల్ ఆఫీసర్‌ (మహిళలు- 42, పురుషులు - 378) పోస్టుల (Medical Officer Posts) భర్తీకి..

Army AFMS Recruitment 2022: ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌లో 420 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
Army Afms
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 16, 2022 | 3:15 PM

Army AFMS Medical Officer Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (Army AFMS).. 420 మెడికల్ ఆఫీసర్‌ (మహిళలు- 42, పురుషులు – 378) పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు డిసెంబర్‌ 31, 2022 నాటికి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 20, 2022 నుంచి సెప్టెంబర్‌ 18, 2022 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.