Weight Loss Tips: సులువుగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతి రోజూ చియా విత్తనాలను ఇలా తిన్నారంటే..
నేటి కాలంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తోన్న మరో సమస్య అధిక బరువు. జీవనశైలి మార్పు వల్ల తలెత్తే కీలక సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. ఐతే బరువు సులువుగా తగ్గడానికి చియా విత్తనాలను సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని ప్రతి రోజూ..
Chia seeds for weight loss: నేటి కాలంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తోన్న మరో సమస్య అధిక బరువు. జీవనశైలి మార్పు వల్ల తలెత్తే కీలక సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. ఐతే బరువు సులువుగా తగ్గడానికి చియా విత్తనాలను సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి శరీరానికి విటమిన్లు, ప్రోటీన్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. చియా గింజలను ఆహారంగా తీసుకుంటే అధిక సమయంపాటు కడుపు నిండుగా ఉంటుంది. ఆహారంగా చియా విత్తనాలను అనేక రకాలుగా తీసుకోవచ్చు. కొన్ని పద్ధతులు మీకోసం..
చియా గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఇలా చేయడం ద్వారా చియా విత్తనాలు బాగా ఉబ్బి, మెత్తగా మారుతాయి. ఈ నీటిలో నిమ్మరసం లేదా ఆరెంజ్ జ్యూస్ కలుపుకుని ఉదయాన్నే తాగవచ్చు. చియా విత్తనాలను సలాడ్‌లో కలుపుకుని కూడా తినవచ్చు. మీకు ఇష్టమైన పండ్లు, కూరగాయలను ముక్కలుగా తరిగి, వాటిపై చియా విత్తనాలను చల్లుకుని సలాడ్ రూపంలో ప్రతి రోజూ తినవచ్చు. చియా గింజలను గ్రైండర్‌లో వేసి పొడి చేసుకుని పిండి రూపంలో తినవచ్చు. రుచికి వీటికి బియ్యం జోడించవచ్చు. ఐతే చియా గింజలను బియ్యంతోపాటు ఉడికించి తింటే అంతగా ఫలితం ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. వోట్స్‌తో చియా విత్తనాలను కలుపుకుని అల్పాహారంగా తినవచ్చు. అలాగే వోట్స్‌ను ఉడికించిన తర్వాత లేదా ఉడికించేటప్పడు ఏ రూపంలోనైనా ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ కలుపుకుని తింటే రుచిగా ఉండటమేకాకుండా బరువును తగ్గించుకోవచ్చు.