Late Night Snacks: రాత్రిపూట స్నాక్స్ తినే అలవాటు ఉందా..? అయితే ఈ విషయాలను తెలుసుకోండి..
వాస్తవానికి కొన్నిసార్లు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల రాత్రిపూట ఆకలి వేస్తుంది. అటువంటి పరిస్థితిలో చాలా మంది ఆహారం తినరు. కానీ కొన్ని స్నాక్స్ తీసుకుంటారు.
Late Night Snacks: కొంతమందికి లేట్ నైట్ స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. అయితే రాత్రిపూట చిరుతిండి తినడం అలవాటు చేసుకోవడం వల్ల బరువు పెరగడంతోపాటు ఇతర సమస్యలు కూడా వస్తాయి. అటువంటి పరిస్థితిలో కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి కొన్నిసార్లు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల రాత్రిపూట ఆకలి వేస్తుంది. అటువంటి పరిస్థితిలో చాలా మంది ఆహారం తినరు. కానీ కొన్ని స్నాక్స్ తీసుకుంటారు. రాత్రి పూట తినే అలవాటు ఉంటే.. కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో ఆకలి తీరడంతోపాటు ఎలాంటి సమస్య ఉండదు.. కావున రాత్రిపూట ఎలాంటి స్నాక్స్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రిపూట తీసుకునే స్నాక్స్..
డ్రైఫ్రూట్స్, వాల్‌నట్స్: అర్థరాత్రి ఏదైనా తినే అలవాటు ఉన్నా.. లేదా ఆలస్యంగా నిద్రపోయిన తర్వాత మీకు ఆకలిగా అనిపిస్తే మీరు నట్స్ తినవచ్చు. ఈ గింజలలో బాదం, వాల్‌నట్, అంజీర్, డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవచ్చు. ఇవి మీ ఆకలిని తీర్చడమే కాకుండా, మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.
పన్నీర్: రాత్రిపూట ఆకలిని తగ్గించుకోవడానికి పనీర్ తినవచ్చు. పనీర్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యం, బరువును జాగ్రత్తగా చూసుకోవచ్చు. దానిపై చాట్ మసాలా చల్లి రుచికి తగినట్లుగా తీసుకోవచ్చు.
పాప్ కార్న్: లేట్ నైట్ స్నాక్ కోసం పాప్ కార్న్ కూడా మంచి ఎంపిక. వాస్తవానికి పాప్‌కార్న్ సులభంగా జీర్ణమవుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీయదు. కాబట్టి మీరు రాత్రిపూట పాప్ కార్న్ తినవచ్చు.
ఓట్స్: ఓట్స్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏదైనా రుచికరమైనది తినాలనుకుంటే.. దాని కోసం మసాలా ఓట్స్ చేసుకుని తినవచ్చు. లేదంటే పాలలో కలుపుకుని కూడా తినవచ్చు. ఆకలిని దూరం చేయడంతో పాటు పూర్తి పోషకాహారాన్ని కూడా అందిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..