Health Tips: భుజాలు, మెడ నొప్పితో బాధపడుతున్నారా..? జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే ఉపశమనం..

మెడ, భుజాల్లో నొప్పి ఉన్నప్పుడు ఒక వ్యక్తి పని చేయడం కష్టంగా మారుతుంది. అలాంటి పరిస్థితిలో మీరు ఈ నొప్పిని వదిలించుకోవడానికి కొన్ని ఇంటి నివారణ చిట్కాలను అనుసరించవచ్చు.

Health Tips: భుజాలు, మెడ నొప్పితో బాధపడుతున్నారా..? జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే ఉపశమనం..
Health Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 16, 2022 | 8:34 PM

Tips To Relieve Shoulder And Neck Pain: ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు భుజం, మెడ నొప్పితో బాధపడుతున్నారు. ఈ సమస్య కొన్నిసార్లు తప్పుడు జీవనశైలి, మంచిగా కూర్చోకోపోవడం వల్ల వస్తుంది. సిరలు స్ట్రెయిన్ కావడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. మరోవైపు మెడ, భుజాల్లో నొప్పి ఉన్నప్పుడు ఒక వ్యక్తి పని చేయడం కష్టంగా మారుతుంది. అలాంటి పరిస్థితిలో మీరు ఈ నొప్పిని వదిలించుకోవడానికి కొన్ని ఇంటి నివారణ చిట్కాలను అనుసరించవచ్చు. మీరు కూడా భుజం, మెడ నొప్పితో బాధపడుతుంటే.. ఈ నొప్పిన ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

భుజాలు, మెడ నొప్పిని దూరం చేసుకునేందుకు ఈ పద్ధతులను అనుసరించండి..

పసుపు: పసుపులో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో టీస్పూన్ పసుపు కలపి తాగండి. ఈ పాలను రోజుకు రెండుసార్లు తాగాలి. ఈ పాలు భుజం, మెడ నొప్పిని దూరం చేయడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

యాపిల్ సైడర్ వెనిగర్: యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి నొప్పి, మంటను తగ్గించడంలో సహాయపడతాయి. యాపిల్ సైడ్ వెనిగర్ తీసుకోవడానికి ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోండి. దానికి ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ వేసి, రుచికి అనుగుణంగా తేనె కలపండి. ఈ నీటిని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగండి. ఈ నీరు భుజం, మెడ నొప్పిని, వాపును కూడా తగ్గిస్తుంది.

ఐస్ ప్యాక్: ఐస్ ప్యాక్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఐస్ వాపును కూడా తగ్గిస్తుంది. దీన్ని ఉపయోగించడానికి నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్ ప్యాక్ ఉంచండి. కొంతకాలం తర్వాత నొప్పి తగ్గుతుంది.

రాక్ సాల్ట్: రాతి ఉప్పు శరీరానికి చాలా మేలు చేస్తుంది. భుజం, మెడ నొప్పికి దీనిని ఉపయోగించడానికి. ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో రెండు నుంచి 3 టీస్పూన్ల రాక్ ఉప్పు కలపండి. ఈ నీటిని మెడ, భుజం నొప్పిగా ఉన్న భాగంలో పోయాలి. రాక్ సాల్ట్ వాటర్ అలసటను తొలగిస్తుంది, అలాగే భుజాలు, మెడ నొప్పిని కూడా తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ