Himachal Pradesh Elections 2022: హిమాచల్ పీఠంపై రెండోసారి కన్నేసిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల గురించి కీలక అంశాలు..

గత అసెంబ్లీ ఎన్నికలను 2017 నవంబరులో నిర్వహించారు. నాటి ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాల్లో విజయం గెలుపొందగా.. కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలకు పరిమితమై రాష్ట్రంలో అధికారం కోల్పోయింది.

Himachal Pradesh Elections 2022: హిమాచల్ పీఠంపై రెండోసారి కన్నేసిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల గురించి కీలక అంశాలు..
Himachal Pradesh Elections
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 16, 2022 | 10:01 PM

Know About Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు (Himachal Pradesh election 2022) జరగనున్నాయి. ఆ రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు నవంబరు మాసంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరలోనే విడుదల చేయనుంది. అక్కడ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 35 గా ఉంది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ పదవీకాలం 2023 జనవరి 8నాటి వరకు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలను 2017 నవంబరులో నిర్వహించారు. నాటి ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాల్లో విజయం గెలుపొందగా.. కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలకు పరిమితమై రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. బీజేపీ విజయంతో జైరామ్ ఠాకూర్ ఆ రాష్ట్ర సీఎం అయ్యారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 48.8 శాతం ఓట్లు పోల్ కాగా.. కాంగ్రెస్ పార్టీకి 41.7 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీ బలం 43గా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ బలం 22గా ఉంది.

అధికార బీజేపీ.. అక్కడ వరుసగా రెండోసారి విజయఢంకా మోగించాలని పట్టుదలగా ఉంది. అయితే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(AAP).. ఈసారి గుజరాత్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లోనూ బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య త్రిముఖ పోటీ నెలకొనే అవకాశముంది. కొన్ని చోట్ల సీపీఎం, సీపీఐ, బీఎస్పీ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వనున్నారు.

హిమాచల్ ప్రదేశ్ నేపథ్యం..

ఇవి కూడా చదవండి

1 నవంబర్ 1956 నుంచి కేంద్ర పాలిత ప్రాంతం ఉన్న హిమాచల్ ప్రదేశ్, 25 జనవరి 1971న రాష్ట్రంగా ఆవిర్భవించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 6,864,602 గా ఉంది. రాజధాని సిమ్లా, రాష్ట్రంలో 12 జిల్లాలు ఉన్నాయి. దేవభూమిగా పిలిచే హిమాచల్ లో హిందీ అధికారిక భాషగా ఉంది.

హిమాచల్ ప్రదేశ్‌లో 5,025,541లో ఓట్లు ఉన్నాయి. పురుషులు 2,531,321 మంది ఉండగా.. 2,457,032 మహిళా ఓటర్లు ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..