AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himachal Pradesh Polls: ఆప్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమే.. భారీ హామీలతో దూకుడు పెంచిన కేజ్రీవాల్..

Himachal Pradesh Assembly Polls: పంజాబ్ విజయం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ హిమాచల్ ప్రదేశ్‌పై ఫోకస్ పెట్టారు. తన తన 'ఉచిత' కార్డును ఉపయోగించేందుకు ప్లాన్ చేస్తోంది. అక్కడ అధికారంలో..

Himachal Pradesh Polls: ఆప్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమే.. భారీ హామీలతో దూకుడు పెంచిన కేజ్రీవాల్..
Himachal Pradesh assembly elections
Sanjay Kasula
| Edited By: Team Veegam|

Updated on: Aug 25, 2022 | 4:07 PM

Share

పంజాబ్ విజయం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ హిమాచల్ ప్రదేశ్‌పై ఫోకస్ పెట్టారు. తన తన ‘ఉచిత’ కార్డును ఉపయోగించేందుకు ప్లాన్ చేస్తోంది. అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP)కి ఢీ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు భారీ హామీలను ఇస్తోంది. రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందజేస్తామని హామీ ఇచ్చింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తమ జాతీయ ఆశయాలను బహిరంగంగా ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్. తమ పార్టీ నెక్స్ట్ టార్గెట్ హిమాచల్ ప్రదేశ్ అంటూ ప్రకటించారు.

కేజ్రీవాల్ ఇస్తున్న హామీలపై అధికార పార్టీ బీజేపీతోపాటు కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అయితే వారి మర్శలకు తాము ఆందోళన చెందడం లేదని ప్రకటించుకుంది ఆప్. తాము ఖచ్చితంగా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమాగా ఉంది. ఆ చేస్తున్న హామీలు ఈ రాష్ట్రంలో కలిసి వచ్చే అకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

త్వరలో ‘జాతీయ పార్టీ’గా.. 

ఇవి కూడా చదవండి

ఇక హిమాచల్ ప్రదేశ్‌లో పోటీ రెండు పార్టీల మధ్య ఉంటుందని వారు విశ్వసిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాయాజాలంపై ఎక్కువగా ఆధారపడే AAP హిమాలయ రాష్ట్రంలో తన వ్యూహాన్ని రచిస్తోంది. ఇదిలావుంటే.. ఢిల్లీ, పంజాబ్ తర్వాత, AAP ఇప్పుడు గోవాలో కూడా తన ముద్ర వేసింది. మరో రాష్ట్రంలో గుర్తింపు లభిస్తే.. అధికారికంగా ‘జాతీయ పార్టీ’గా మారుతుంది.

తృతీయ శక్తిగా ‘ఆప్’

‘రాష్ట్రంలో తృతీయ శక్తిగా అవతరిస్తుందా..? లేదా.. అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈ సమయంలో తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అంటూ ప్రకటించారు బీజేపీ సీనియర్ మంత్రి. హిమాచల్ ప్రదేశ్‌లో చాలా కాలం కాంగ్రెస్ ఆధికారంలో ఉంది. అయితే 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు.. ఆ రాష్ట్రం దాని మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి శాంత కుమార్‌ను చూసింది. అయితే 1985 నుంచి హిమాచల్ ప్రదేశ్‌ను బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రత్యామ్నాయంగా పాలిస్తున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి?

గ్రాండ్ ఓల్డ్ పార్టీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షురాలిగా ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్‌ను నియమించింది. ఇది ప్రధానంగా యాంటీ-ఇంకంబెన్సీని క్యాష్ చేసుకునేందుకు పాత పెన్షన్ స్కీమ్ (OPS)ని తిరిగి తీసుకువస్తానని హామీ ఇచ్చింది కాంగ్రెస్.

అయితే, AAP మాదిరిగానే, కాంగ్రెస్ కూడా గృహ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయంగా హామీ ఇచ్చింది.

బీజేపీ సంగతేంటి?

అయితే, బిజెపి, ఆప్, కాంగ్రెస్‌ల గురించి పట్టించుకోవడం లేదని.. పనితీరు ఆధారంగా తిరిగి అధికారంలోకి వస్తుందని నమ్మకంగా ఉందన్నారు. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని లోక్‌సభ సెగ్మెంట్లలో బూత్-స్థాయి ఆఫీస్ బేరర్ల సమావేశాలను కూడా నిర్వహించింది.

బిజెపి సీనియర్ మంత్రి సురేష్ భరద్వాజ్ మాట్లాడుతు.. “ప్రజల సంక్షేమం కోసం మా ప్రభుత్వం పని చేస్తుంది. హిమాచల్‌లో, ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ నేతృత్వంలోని మా ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం అనేక చర్యలను ప్రారంభించింది.” అని వెల్లడించారు.

“మేము సామాజిక భద్రతా పింఛన్ల పరిధిని పెంచాం, హిమ్‌కేర్‌ని అమలు చేయడం ద్వారా ఆయుష్మాన్ పథకం, నిర్దిష్ట పరిమితుల్లో ఉచిత విద్యుత్, మహిళలకు తక్కువ బస్సు ఛార్జీలు, ఇతరులకు తగ్గిన ఛార్జీలు మొదలైనవి. మా ప్రభుత్వం తీసుకున్న అనేక ఇతర చర్యలు ఉన్నాయి. బీజేపీ ప్రజల ఆశీర్వాదంతో తాము బలంగా ఉన్నామని.. 2022 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లుగా ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ కూడా అవినీతి లేని సుపరిపాలనను అందిస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ.. మేము వేగంగా కోలుకున్నాం. హిమాచల్ ప్రదేశ్ క్రాప్ డైవర్సిఫికేషన్ స్కీమ్‌ను ప్రభుత్వం అన్ని జిల్లాల్లో రూ. 1,010 కోట్లతో అమలు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రాథమిక, మధ్య, ఉన్నత పాఠశాలల స్థూల నమోదు నిష్పత్తి వంద శాతం ఉంది. సీనియర్ సెకండరీ పాఠశాలల విషయంలో ఇది 85.6 శాతంగా ఉందంటున్నారు ఆయన.

మరిన్ని జాతీయ వార్తల కోసం..