AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sofa Cleaning Tips : ఇంట్లో పాత సోఫాలు చెడిపోతున్నాయా?.. ఈ సులభమైన చిట్కాలతో కొత్తగా మార్చండి..

ఇంట్లో ఉన్న పాత సోఫా పాడైపోవడం ప్రారంభించినట్లయితే.. మీరు కొన్ని సులభమైన చిట్కాలతో మీ పాత సోఫాను కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఎలా క్లీన్ చేసుకోవచ్చో తెలుసుకుందాం..

Sofa Cleaning Tips : ఇంట్లో పాత సోఫాలు చెడిపోతున్నాయా?.. ఈ సులభమైన చిట్కాలతో  కొత్తగా మార్చండి..
Sofa Cleaning Tips
Sanjay Kasula
|

Updated on: Aug 15, 2022 | 8:20 PM

Share

ఇళ్ల పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇది మీ ఇంటిని అందంగా మార్చడమే కాకుండా.. అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. అందుకే ఇంట్లోని ప్రతి వస్తువును శుభ్రం చేయడం ముఖ్యం. అది టీవీ ఫ్రిజ్ అయినా సోఫా అయినా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో సోఫా ఉంటుంది. సోఫా ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా దాని మీద చాలా హాయిగా కూర్చుని మీ పనులు చేసుకోవచ్చు. ఇది కాకుండా, సోఫా ఇంటి అందాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. కానీ సోఫా మురికిగా మారితే.. దానిని శుభ్రం చేయడం చాలా పెద్ద పని అవుతుంది. ఈ రోజు మనం అలాంటి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.. దీని ద్వారా మీరు మీ ఇంటి పాత సోఫాను మెరిసేలా చేయవచ్చు.

ఫాబ్రిక్ సోఫా శుభ్రపరచడం

ఈ రోజుల్లో చాలా మంది ఫ్యాబ్రిక్ సోఫాలను ఇష్టపడుతున్నారు. అందుకే చాలా మంది ఫ్యాబ్రిక్ సోఫాకు ప్లేస్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ సోఫాలు చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే, కూర్చోవడం పరంగా చాలా సౌకర్యంగా ఉంటుంది. అయితే ఈ సోఫాను మెయింటెయిన్ చేయడం కాస్త కష్టమే. మీ ఇంట్లో ఫాబ్రిక్ సోఫా ఉంటే, దానిని శుభ్రం చేయడానికి మీరు కొన్ని ప్రత్యేక చిట్కాలను అనుసరించవచ్చు.

సోఫాను శుభ్రం చేయడానికి, 6 టీస్పూన్ల బాత్ సోప్ పౌడర్ తీసుకోండి. దీని తరువాత, ఈ పొడికి 1 కప్పు ఉడికించిన నీరు కలపండి. సబ్బు నురగ వచ్చిన తర్వాత దానికి 2 టీస్పూన్ల అమ్మోనియా లేదా తేనె జోడించండి. ఆ తరువాత, ఈ ద్రావణాన్ని చల్లబరచండి. చల్లబడిన తర్వాత దానిని మీ చేతుల్లోకి తీసుకోండి.., బాగా కలపండి దీంతో నురగ వస్తుంది. ఇప్పుడు సోఫాపై భాగంలో గుడ్డ లేదా స్పాంజ్ సహాయంతో ఈ నురుగుతో శుభ్రం చేయండి. దీని తరువాత సోఫాను ఫ్యాన్ కింద ఆరనివ్వండి. దీంతో ఫ్యాబ్రిక్ సోఫా కొత్తగా కనిపిస్తాయి.

మనలో చాలామంది లెదర్ సోఫాలను ఇష్టపడతారు. ఇటువంటి సోఫాలు చాలా ఖరీదైనవి. అలాగే, దాని నిర్వహణ.. శుభ్రపరచడం కూడా చాలా కష్టం. లెదర్ సోఫాను క్లీన్ చేసే ఏకైక మార్గం మైల్డ్ క్లీనర్‌తో శుభ్రం చేయడమే. మీరు ఏదైనా మంచి కంపెనీ నుంచి క్లీనర్‌ను కొనుగోలు చేయవచ్చు. దానిని ఉపయోగించవచ్చు.

ఇది కాకుండా, ఈ సోఫాల కోసం ఎల్లప్పుడూ మృదువైన బ్రష్.. వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించాలని గుర్తుంచుకోండి. వెనిగర్ మీద దుమ్ము శుభ్రం చేయడానికి మీరు నీటితో కలిపిన వెనిగర్ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం