TSLPRB Updates: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. రేపటి నుంచే ప్రిలిమినరీ ఎగ్జామ్ హాల్ టికెట్లు..

TSLPRB Updates: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించనున్న ప్రిలిమినరీ ఎగ్జామ్ హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్‌డేట్..

TSLPRB Updates: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. రేపటి నుంచే ప్రిలిమినరీ ఎగ్జామ్ హాల్ టికెట్లు..
Ts Police Jobs
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 17, 2022 | 4:10 PM

TSLPRB Updates: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించనున్న ప్రిలిమినరీ ఎగ్జామ్ హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్‌డేట్ విడుదల చేసింది. ఆగస్టు 28న పరీక్ష జరుగనుండగా.. అభ్యర్థులు రేపటి నుంచి అంటే ఆగస్టు 18 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని పేర్కొంది. ఆగస్టు 18 ఉదయం 8 నుంచి ఆగస్టు 26 అర్థరాత్రి 12 గంటల వరకు TSLPRB వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులు తమ తమ హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది TSLPRB. ఈ హాల్ టికెట్లకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా, హాల్ టికెట్ డౌన్‌లోడ్ అవకపోయినా.. support@tslprb.in కి మెయిల్ చేయడం గానీ, 93937 11110, 93910 05006 నెంబర్లకు కాల్ చేయడం గానీ చేయొచ్చని TSLPRB పేర్కొంది.

రాష్ట్ర వ్యాప్తంగా 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం TSLPRB ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటు.. 63 ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్&ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. కాగా, ఈ పోస్టుల నియామకానికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్.. ఆగస్టు 28న (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగనుంది. ఇక కానిస్టేబుల్ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్&ఉద్యోగాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..