TS Lawcet 2022 Results: తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ 2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
తెలంగాణ లాసెట్ (TS LAWCET-2022), పీజీ లా సెట్ (PGLCET-2022) ఫలితాలు ఈ రోజు (ఆగస్టు 17) విడుదలయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి (TSCHE) ఛైర్మన్ ఆర్ లింబాద్రి..
TS lawcet 2022 Result Date: తెలంగాణ లాసెట్ (TS LAWCET-2022), పీజీ లా సెట్ (PGLCET-2022) ఫలితాలు ఈ రోజు (ఆగస్టు 17) విడుదలయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి (TSCHE) ఛైర్మన్ ఆర్ లింబాద్రి లాసెట్, పీజీలాసెట్ ఫలితాలు ప్రకటించారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రెండు సెట్లలో కలిపి మొత్తం 74 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు లింబాద్రి ఈ సందర్భంగా తెలియజేశారు. వీటిల్లో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష రాసిన వారిలో 74.76 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు 68.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక పీజీ లాసెట్‌లో 91.10 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులైనట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. కాగా ఈ ఏడాది జూలై 21, 22 తేదీల్లో జరిగిన లాసెట్, పీజీలాసెట్ పరీక్షలకు మొత్తం 35,538 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 28,921 మంది విద్యార్ధులు ఈ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి..టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..