Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIA MHA Recruitment 2022: నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలో కేంద్ర కొలువులు.. నెలకు రూ.లక్షన్నర జీతం..

కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA).. 45 సెక్షన్‌ ఆఫీసర్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ - 1, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ తదితర పోస్టుల (Section Officer Posts) భర్తీకి

NIA MHA Recruitment 2022: నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలో కేంద్ర కొలువులు.. నెలకు రూ.లక్షన్నర జీతం..
Nia
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2022 | 3:43 PM

NIA MHA Section Officer Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA).. 45 సెక్షన్‌ ఆఫీసర్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ – 1, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ తదితర పోస్టుల (Section Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు (ఆగస్టు 28, 2022) పోస్టు ద్వారా దరఖాస్తులు పంపవచ్చు. నోటిఫికేషన్‌ జులై 28, 2022న విడుదలైంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,42,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు:

  • సెక్షన్ ఆఫీసర్/ఆఫీస్ సూపరింటెండెంట్ (SO/OS) పోస్టులు: 3
  • అసిస్టెంట్ పోస్టులు: 9
  • అకౌంటెంట్ పోస్టులు: 1
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 పోస్టులు: 23
  • UDC పోస్టులు: 12

అడ్రస్‌: The SP (Adm), NIA Hqrs, CGO Complex, Lodhi Road, New Delhi-110003.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇది కూడా చదవండి..టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..