Nitish Kumar: కిడ్నాప్ కేసు ఉన్నట్లుగా నాకు తెలియదు.. ఆరోపణలపై స్పందించిన బీహార్ సీఎం..

బీహార్ ప్రభుత్వంలో ఆర్జేడీ ఎమ్మెల్సీ, న్యాయశాఖ మంత్రి కార్తికేయ సింగ్ విషయంలో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. న్యాయశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన కార్తీకేయసింగ్‌ మీద కిడ్నాప్‌ కేసు..

Nitish Kumar: కిడ్నాప్ కేసు ఉన్నట్లుగా నాకు తెలియదు.. ఆరోపణలపై స్పందించిన బీహార్ సీఎం..
Bihar Cm Nitish Kumar
Follow us
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2022 | 3:43 PM

బీహార్‌ కేబినెట్‌ కొలువు తీరిన మరుసటి రోజే వివాదం నెలకొంది. బీహార్ ప్రభుత్వంలో ఆర్జేడీ ఎమ్మెల్సీ, న్యాయశాఖ మంత్రి కార్తికేయ సింగ్ విషయంలో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. న్యాయశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన కార్తీకేయసింగ్‌ మీద కిడ్నాప్‌ కేసు ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోర్టుకు హాజరుకావాల్సిన రోజే ఆయన మంత్రిగా ప్రమాణం చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను ఆర్జేడీ ఖండించింది. కార్తీకేయసింగ్‌పై నమోదైన కిడ్నాప్‌ కేసుపై కోర్టు స్టే విధించిందని ఆర్జేడీ నేతలంటున్నారు. మంత్రి కార్తీకేయసింగ్‌ మీద కేసులున్నట్టు తనకు తెలియదంటున్నారు సీఎం నితీష్‌కుమార్‌.

కార్తికేయ సింగ్ కిడ్నాప్‌ కేసు..

నిజానికి రాజీవ్ రంజన్ 2014లో కిడ్నాప్‌కు గురయ్యారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై కోర్టు విచారణ చేపట్టింది. రాజీవ్ రంజన్ కిడ్నాప్ కేసులో బీహార్ న్యాయ శాఖ మంత్రి కార్తికేయ సింగ్ కూడా నిందితుడు. వీరిపై కోర్టు వారెంట్ జారీ చేసింది. కార్తికేయ సింగ్ కోర్టు ముందు లొంగిపోలేదు. బెయిల్ కోసం దరఖాస్తు చేయలేదు. అయితే ఆగస్టు 16న ఆయన కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా..  అదే రోజున మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు కొత్త ప్రభుత్వంపై బీజేపీ దూకుడు పెంచింది. బీహార్‌లో కొత్త ప్రభుత్వం అంటే జంగిల్ రాజ్ అని ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

కార్తికేయ సింగ్ ఎవరు?

కార్తికేయ సింగ్ MLC. శాసనమండలి ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. మొకామా నివాసి కార్తికేయ సింగ్ కూడా ఉపాధ్యాయుడిగా కొంత కాలం పని చేశారు. అనంత్ సింగ్ అతన్ని మాస్టర్ సాహిబ్ అని పిలుస్తారని చెబుతారు. అనంత్ సింగ్ జైలులో ఉన్నప్పుడు, మొకామా నుంచి పాట్నా వరకు కార్తికేయ మాస్టర్ అతని అన్ని పనులను చూసుకుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి