AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మరి కాసేపట్లో పెళ్లి.. సీన్‌ కట్‌ చేస్తే, దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు.. చివరకు..

ప్రియుడు.. మరో యువతితో వివాహమాడుతున్నడన్న విషయం తెలుసుకున్న.. ప్రియురాలు పీటలపై పెళ్లిని ఆపించింది.

Viral News: మరి కాసేపట్లో పెళ్లి.. సీన్‌ కట్‌ చేస్తే, దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు.. చివరకు..
Marriage
Shaik Madar Saheb
|

Updated on: Aug 17, 2022 | 4:14 PM

Share

Groom lover stopped marriage: ఇటీవల కాలంలో పీటలపై పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ప్రేమ వ్యవహారం, బంధువుల మధ్య గొడవ, నిత్య పెళ్లికొడుకుల బాగోతం.. ఇలా ఎన్నో సందర్భాల్లో పెళ్లిళ్లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా.. ప్రియుడు.. మరో యువతితో వివాహమాడుతున్నడన్న విషయం తెలుసుకున్న.. ప్రియురాలు పీటలపై పెళ్లిని ఆపించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గుత్తి మండలం ఇసురాళ్లపల్లిలో మరి కాసేపట్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. దీంతో బంధువులంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలియడందో.. పంచాయితీ పోలీసుల దగ్గరకు చేరింది.

ఇసురాళ్లపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన యువతిని ప్రేమించాడు. అయితే, ఈ క్రమంలో పెద్దవడుగూరు మండలానికి చెందిన మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు.. ఆళ్లగడ్డ నుంచి గుత్తికి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రమేష్‌ ఇంటికి చేరుకొని పెళ్లిని ఆపించారు. అనంతరం రమేష్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. దీంతో ఈ పెళ్లి ఇష్టం లేదని.. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని రమేష్ చెప్పాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు రమేష్‌పై ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి:  టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..