Vizag: కోడి పిల్లలను గెద్ద ఎత్తుకెళ్లినట్లుగా..! విశాఖలో సెల్‌ఫోన్లను లాక్కెళ్తున్న ముఠా..
ఈ దొంగలు టోటల్ డిఫరెంట్. కోడి పిల్లను గెద్ద తన్నుకు పోయిన విధంగా.. రోడ్లపై సెల్ ఫోన్ మాట్లాడకుంటూ వెళ్తున్న వారిని టార్గెట్ చేసి.. క్షణాల్లో రయ్యిన వచ్చి సెల్‌ఫోన్ లాక్కొని పారిపోతున్నారు.
Andhra Pradesh: విశాఖలో రోడ్లపై ఒంటరిగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళుతున్న వాళ్లే టార్గెట్‌గా చేసుకొని మొబైల్స్ ఎత్తుకెళ్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. అంతేకాదు ఆ ముఠా వినియోగించిన నాలుగు బైక్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గత కొన్ని రోజులుగా విశాఖ నగరంలో.. సెల్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. అది కూడా ఇళ్లల్లోనూ కాదు.. కార్యాలయాల్లోనూ అంతకంటే కాదు.. జేబు దొంగలు కూడా కాదు..! వీళ్లంతా టోటల్ డిఫరెంట్. కోడి పిల్లను గెద్ద తన్నుకు పోయిన విధంగా.. రోడ్లపై సెల్ ఫోన్ మాట్లాడకుంటూ వెళ్తున్న వారిని టార్గెట్ చేసి.. క్షణాల్లో రయ్యిన వచ్చి సెల్‌ఫోన్ లాక్కొని పారిపోతున్నారు. ఇలా చాలాచోట్ల ఇటువంటి ఘటనలు జరిగాయి. పోలీస్ స్టేషన్లలోనూ కొన్ని ఫిర్యాదులు అందాయి. ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ కేసుతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన విశాఖ సిటీ పోలీసులు.. నిందితులను ట్రాక్ చేసి పనిని ప్రారంభించారు. ఆ తర్వాత.. ఇద్దరిని అదుపులోకి తీసుకునే ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపడింది. గాజువాక(Gajuwaka)లో ఉంటున్న భరత్, తన స్నేహితుడు అప్పలరాజుతో కలిసి ఈ చోరీలు చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. వేరే బృందంలో మరో ఇద్దరు బాలలు కూడా ఉన్నారు. పోలీసులు తీగలాగతే డ్రంక్ అంతా కలిగిన చందంగా… ఒక్క కేసులో వీరిని పట్టుకుని విచారించే సరికి.. 21 సెల్ ఫోన్ లో చోరీల వ్యవహారం బయటపడింది. సెల్‌ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు వాళ్లు వినియోగిస్తున్న మరో నాలుగు బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
-ఖాజా, టీవీ9 తెలుగు, వైజాగ్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..