Diet Coke Side-Effects: సాఫ్ట్ డ్రింక్‌లు తెగ తాగేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త.. ఎందుకంటే..

వాస్తవానికి డైట్ సాఫ్ట్‌ డ్రింక్‌ ఆరోగ్యానికి మంచిదేనా..? అని ప్రశ్నిస్తే ఎవ్వరి దగ్గర సరైన సమాధానం ఉండదు. సాఫ్ట్‌ డ్రింక్‌ అనుకున్నంత మంచిదేం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Diet Coke Side-Effects: సాఫ్ట్ డ్రింక్‌లు తెగ తాగేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త.. ఎందుకంటే..
Diet Coke Side Effects
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 17, 2022 | 6:37 PM

Diet Coke Side-Effects: కోక్, ఇతర కూల్‌డ్రింక్స్‌, సోడాల్లో చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఇలాంటి సమయంలో చక్కెర లేదా కేలరీలు లేని సోడాగా ప్రచారం అవుతున్న డైట్ కోక్‌ని చాలామంది ఇష్టంతో తాగుతారు. వాస్తవానికి డైట్ సాఫ్ట్‌ డ్రింక్‌ ఆరోగ్యానికి మంచిదేనా..? అని ప్రశ్నిస్తే ఎవ్వరి దగ్గర సరైన సమాధానం ఉండదు. సాఫ్ట్‌ డ్రింక్‌ అనుకున్నంత మంచిదేం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. మీరు కూడా డైట్ కోక్ తెగ తాగుతుంటే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి.. డైట్‌ కోక్‌ ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తుంది.. దీని వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డైట్ కోక్ సైడ్ ఎఫెక్ట్స్..

మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది: శరీరం నుంచి హానికరమైన టాక్సిన్‌లను తొలగించి రక్తాన్ని నిర్విషీకరణ చేయడంలో మూత్రపిండాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. డైట్ కోక్ ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు వస్తాయి. ఒక రోజులో రెండు కంటే ఎక్కువ డైట్ కోక్ లను తాగితే మీ మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.

ఇవి కూడా చదవండి

బరువు పెరుగుతుంది: డైట్ కోక్‌లో ‘డైట్’ అనే పదం ఉన్నందున అందులో కేలరీలు ఉండవని అందరూ అనుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది పూర్తి అబద్దం. అధ్యయనాల ప్రకారం డైట్ డ్రింక్‌ తీసుకోని వారి కంటే ఒక దశాబ్దం పాటు తరచుగా డైట్ డ్రింక్‌ తాగే వారి నడుము చుట్టుకొలత 70 శాతం ఎక్కువ పెరిగింది.

దంతాలకు హానికరం: డైట్ కోక్ ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. కావున ఇది దంతాల ఎనామెల్‌ను కరిగించి హాని కలిగిస్తుంది. మీరు డైట్ కోక్ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత దంత క్షయ సమస్యలు పెరుగుతాయి. దంతాలు పుచ్చిపోవడం, నొప్పి వంటివి వచ్చే అవకాశముంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది: మరొక ప్రధాన విషయం ఎంటంటే.. డైట్ కోక్ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. సాధారణ LDL కొలెస్ట్రాల్ స్థాయిల కంటే ఎక్కువగా ఉండటం వల్ల స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది: దాహం వేసినప్పుడు డైట్ కోక్ తాగడం అస్సలు మంచిది కాదు. కెఫిన్, సాఫ్ట్‌ డ్రింక్‌లు మూత్రవిసర్జన సమస్యలతోపాటు నిర్జలీకరణానికి కారణమవుతుంది. దాహం వేసినప్పుడు.. డైట్ కోక్ బదులు నీరు లేదా హెర్బల్ టీ లాంటివి తాగడం మంచిదని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..