AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gorantla Madhav: టీడీపీ విడుదల చేసిన రిపోర్టులో వాస్తవాలు లేవు.. గోరంట్ల వీడియో వ్యవహారంపై ఏపీ సీఐడీ చీఫ్‌..

వైరల్‌ అయిన వీడియోను అమెరికాలోని ఓ ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని అది నకిలీది కాదని తేలినట్లు టీడీపీ నేతలు వెల్లడించడంతో.. మళ్లీ ఈ వ్యవహారంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Gorantla Madhav: టీడీపీ విడుదల చేసిన రిపోర్టులో వాస్తవాలు లేవు.. గోరంట్ల వీడియో వ్యవహారంపై ఏపీ సీఐడీ చీఫ్‌..
Gorantla Madhav
Shaik Madar Saheb
|

Updated on: Aug 18, 2022 | 5:11 PM

Share

Gorantla Madhav Video issue: హిందూపురం వైఎస్ఆర్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌.. వీడియో ఇటీవల ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై ఇప్పటికే గోరంట్ల క్లారిటీ ఇవ్వగా.. పోలీసులు కూడా అందులో నిజం లేదంటూ స్పష్టంచేశారు. కాగా దీని అటు.. అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వైరల్‌ అయిన వీడియోను అమెరికాలోని ఓ ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని అది నకిలీది కాదని తేలినట్లు టీడీపీ నేతలు వెల్లడించడంతో.. మళ్లీ ఈ వ్యవహారంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ (AP CID Chief PV Sunil Kumar) గురువారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్‌లో వాస్తవాలు లేవంటూ స్పష్టంచేశారు. ఒక పురుషుడు – మహిళ మాట్లాడుకున్న వీడియో కాల్‌ను వేరొకరు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్ అయినట్లు వెల్లడించారు. అయితే.. దానిలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవ్‌ అంటూ కొందరు ఆరోపించారన్నారు. ప్రైవేట్ ల్యాబ్‌లు ఇచ్చే రిపోర్టులకు విలువ ఉండదని సీఐడీ చీఫ్ పేర్కొన్నారు. అమెరికాలోని ఓ ప్రైవేటు ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ ఎలా ప్రామాణికమని.. ప్రైవేట్‌ ల్యాబ్‌ రిపోర్టును మేం గుర్తించబోమంటూ స్పష్టంచేశారు. జిమ్‌ క్లిఫోర్డ్‌ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం కూడా అసలైనది కాదని.. స్వయంగా జిమ్‌ క్లిఫోర్డ్‌ ఈ అంశాన్ని ధ్రువీకరించిందని తెలిపారు.

అసలు..ఆ వీడియోను ఎవరూ షూట్ చేశారు.. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోను ఫోరెన్సిక్‌కు పంపి రిపోర్ట్ తీసుకున్నారు. ఒరిజినల్ ఫుటేజ్ దొరికినప్పుడు మాత్రమే ముందుకు వెళ్లగలమన్నారు. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్.. దీనిపై కొందరు ఫోరెన్సిక్‌ రిపోర్ట్ అని విడుదల చేశారు ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్‌ను మార్చి ప్రచారం చేశారు. ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వివరణ తీసుకున్నామని.. నిందితులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వీడియో కంటెంట్ ఒరిజినలా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదని సునీల్ కుమార్‌ తెలిపారు. నకిలీ లెటర్లు ప్రచారం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామంటూ సునీల్‌ కుమార్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..