Suspicious Boat: సముద్రంలో తేలుతూ కనిపించిన అనుమానాస్పద పడవ.. ఏముందా అని చెక్ చేయగా..
మహారాష్ట్రలోని రాయఘడ్ జిల్లా హరిహరేశ్వర్ సముద్ర తీర ప్రాంతంలో అనుమానాస్పద బోట్ ఒకటి..
మహారాష్ట్రలోని రాయగడ జిల్లా హరిహరేశ్వర్ సముద్ర తీర ప్రాంతంలో అనుమానాస్పద బోట్ స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. తొలుత ఈ పడవ ఆ ప్రాంతానికి చెందిన మత్స్యకారులదని అనుకోగా.. అది సంద్రంలో తేలుతూ.. ఎంతసేపటికి ఒడ్డుకు చేరకపోవడంతో.. స్థానికులకు అనుమానమొచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.
సమాచారం అందుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం స్పాట్‌కు చేరుకున్నారు. బోట్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా.. వారికి ఏకే 47తో సహా మరికొన్ని భారీ ఆయుధాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో రాయగడలో హైఅలెర్ట్ ప్రకటించారు పోలీసులు. తీర ప్రాంతం నుంచి వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది. దహీహండీ, గణేశోత్సవాలు సమీపిస్తుండటంతో.. రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర ఏమైనా జరుగుతోందా అనే చర్చ మొదలైంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పలు వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా.. ఆ పడవలు ఎవరివి.? ఎక్కడి నుంచి వచ్చాయి.? ఆయుధాలు ఎవరి కోసం తరలించారన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
An unidentified boat found at Harihareshwar Beach and a lifeboat found at Bharadkhol in Raigad district. Nobody is present on either of them. Coast Guard and Maharashtra Maritime Board have been informed of the same. Police Department is taking the necessary action: Local Police pic.twitter.com/gaDoFWPPvL
— ANI (@ANI) August 18, 2022