AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitin Gadkari: కీలకబాధ్యతల నుంచి నితిన్ గడ్కరీకి ఉద్వాసన.. BJP అసలు వ్యూహాం ఇదేనా..?

ప్రతి రాజకీయ పార్టీ ప్రత్యేకమైన వ్యూహాలతో ముందుకెళ్తాయి.  2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించే లక్ష్యంతో ఎప్పటికప్పుడు ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేస్తూ.. కొత్త వ్యూహలను..

Nitin Gadkari: కీలకబాధ్యతల నుంచి నితిన్ గడ్కరీకి ఉద్వాసన.. BJP అసలు వ్యూహాం ఇదేనా..?
Nitin Gadkari
Amarnadh Daneti
|

Updated on: Aug 18, 2022 | 11:48 AM

Share

BJP Strategy: ప్రతి రాజకీయ పార్టీ ప్రత్యేకమైన వ్యూహాలతో ముందుకెళ్తాయి.  2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించే లక్ష్యంతో ఎప్పటికప్పుడు ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేస్తూ.. కొత్త వ్యూహలను రచిస్తున్నాయి. ఈవిషయంలో బీజేపీ ఒక అడుగు ముందుదనే చెప్పుకోవాలి. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని తప్పించడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసినా.. ఇది బీజేపీ పెద్దల వ్యూహాంలో భాగమేనని తెలుస్తోంది. ఆర్ ఎస్ ఎస్ స్వయం సేవక్ గా, ఏబీవీపీ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చిన నితిన్ గడ్కరీ మహారాష్ట్ర రాజకీయాల నుంచి ఆర్ ఎస్ ఎస్ ఆశీర్వాదంతో 2009లో బీజేపీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టారు. అలాంటి కీలక నేత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పటికి కొంతకాలంగా పార్టీ వ్యవహారాల్లో యాక్టివ్ గా లేరు. అయితే పార్టీయే గడ్కరీ ప్రాధాన్యతను తగ్గిస్తుందన్న వాదన కూడా ఉంది. ప్రస్తుతం బీజేపీ పార్లమెంటరీ బోర్డు బాధ్యతల నుంచి గడ్కరీని తప్పించిన బీజేపీ నాయకత్వం త్వరలో ఆయన్ను కేంద్రమంత్రివర్గం నుంచి కూడా తప్పించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

బీజేపీకి కీలకనాయకులైన ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నాయకులను వయస్సు కారణంగా వ్యూహాం ప్రకారం కీలక బాధ్యతల నుంచి తప్పించిన ఉదంతాన్ని ప్రస్తుత పరిస్ధితులు గుర్తుకు తెస్తున్నాయి. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమనే నినాదంతో బీజేపీ ముందుకెళ్తోంది. ప్రత్యామ్నయ నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో నాయకత్వ లేమిని నివారించవచ్చనేది ఆర్ ఎస్ ఎస్, బీజేపీ ఉమ్మడి ప్రణాళికగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించని కారణంగానే ప్రస్తుతం నాయకత్వ లేమితో కొట్టిమిట్టాడుతోంది. అటువంటి తప్పిదాలు జరగకుండా ఇప్పటినుంచే బీజేపీ జాగ్రతపడుతుందని చెప్పుకోవచ్చు. నితిన్ గడ్కరీని తప్పించడం ఈ వ్యూహంలో భాగంగానే చూడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. నితిన్ గడ్కరీ సొంత రాష్ట్రం నుంచి వచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్ కు పార్టీలో ప్రాధాన్యతనిస్తున్న విషయాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది.

మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే మద్దతుతో దేవేండ్రఫడ్నవీస్ సీఎం పీఠం ఎక్కుతారని భావించినప్పటికి.. బీజేపీ అధిష్టానం నిర్ణయంతో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నితీన్ గడ్కరీని పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించిన తర్వాత అదే ప్రాంతానికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ను పార్లమెంటరీ బోర్డులో చేర్చుకోవడం ద్వారా మహారాష్ట్ర రాజకీయాల్లో ఫడ్నవీస్ పాత్రను పెంచినట్లు తెలుస్తోంది. నితిన్ గడ్కరీని తొలగించాలన్న నిర్ణయం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకున్న ఏకపక్ష నిర్ణయంగా చూడలేం.

ఇవి కూడా చదవండి

బీజేపీ తీసుకునే కీలక నిర్ణయాల్లో ఆర్ ఎస్ ఎస్ పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఆర్ ఎస్ ఎస్ అంటే అభిమానం ఉన్న గడ్కరీ సంస్థ చెప్పిన నిర్ణయాన్ని, ఆదేశాన్ని జవదాటరు.. అందుకే ఆర్ ఎస్ ఎస్ కన్నుసన్నల్లోనే ఈనిర్ణయం జరిగినట్లు భావించాలి. గడ్కరీ, ఫడ్నవీస్ వీరంతా సంఘ్ కు చెందిన వారే. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా.. రాబోయే 25 ఏళ్ల సంస్థ అవసరాలకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేయాలని తీర్మానించారు. ఈవ్యూహాంలో భాగంగానే యువ నాయకులు ప్రధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బీజేపీ ఏం చేసినా దానికో ప్రత్యేక వ్యూహాం ఉంటుందనేది గడ్కరీ తొలగింపుతో మరోసారి స్పష్టమైంది.

ఇది కూడా చదవండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..