Delhi Rohingya: రోహింగ్యాలకు ఆశ్రయమిచ్చేది లేదు.. స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ.. ట్వీట్‌తో అబాసుపాలైన కేంద్రమంత్రి..

Delhi Rohingya: ఢిల్లీలో రోహింగ్యాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తుందన్న వార్తలు అవాస్తవమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రోహింగ్యాలకు EWS కోటా కింద ఇళ్లు నిర్మిస్తారన్న..

Delhi Rohingya: రోహింగ్యాలకు ఆశ్రయమిచ్చేది లేదు.. స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ.. ట్వీట్‌తో అబాసుపాలైన కేంద్రమంత్రి..
Ministry Of Home Affairs In
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 17, 2022 | 7:21 PM

Delhi Rohingya: ఢిల్లీలో రోహింగ్యాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తుందన్న వార్తలు అవాస్తవమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రోహింగ్యాలకు EWS కోటా కింద ఇళ్లు నిర్మిస్తారన్న ప్రచారంలో నిజం లేదని కూడా కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. విదేశాల నుంచి దేశంలోకి అక్రమంగా వచ్చినవాళ్లు నిర్ధేశించిన డిటెన్షన్‌ సెంటర్ల లోనే ఉంటారని కూడా ప్రకటన విడుదల చేసింది.

అయితే, ఈ వ్యవహారంలో తప్పుడు ట్వీట్‌ చేసి అభాసుపాలయ్యారు కేంద్రమంత్రి హర్ధీప్‌సింగ్‌ పూరి. అంతకుముందు రోహింగ్యాలకు ఢిల్లీలో ఫ్లాట్‌లు నిరిస్తున్నామని, శరణార్దులను భారత్‌ గౌరవిస్తుందని విమానయాన శాఖ మంత్రి హర్ధీప్‌సింగ్‌ పూరి ట్వీట్‌ చేశారు. బకారావాలా ప్రాంతంలో EWS కోటా కింద ఫ్లాట్లు ఇస్తామని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి గైడ్‌లైన్స్‌ ఆధారంగా శరణార్ధులకు ఆశ్రయం కల్పిస్తామన్నారు. 24 గంటల పాటు రోహింగ్యాలకు రక్షణ కల్పిస్తామని కూడా ట్వీట్‌లో పేర్కొన్నారు హర్దీప్‌సింగ్‌ పూరి.

ఇవి కూడా చదవండి

అయితే హర్ధీప్‌సింగ్‌ ట్వీట్‌ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవడంతో.. కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. రోహింగ్యాలకు ఢిల్లీలో ఎలాంటి ఫ్లాట్‌లు నిర్మించడం లేదని స్పష్టం చేసింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తరువాత దేశంలో అక్రమంగా చొరబడ్డ వాళ్లను వెనక్కి పంపిస్తామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే.. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానాలపై ఆమ్ ఆద్మీ సహా పలు పార్టీలు భగ్గుమన్నాయి. రోహింగ్యాలకు వంతపాడుతూ తీవ్రమైన కుట్రకు బీజేపీ తెరలేపుతోందని ఆమ్‌ఆద్మీ ఆరోపించింది. కాంగ్రెస్‌లాగే బీజేపీ కూడా రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా వాడుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆమ్‌ఆద్మీ MLA సౌరబ్‌ భరద్వాజ్‌ విమర్శించారు. ఈ రెండునాల్కల ధోరణిని గుర్తించి- బీజేపీ కార్యకర్తలు ఆ పార్టీని వదిలి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..