PM Modi: స్వాతంత్ర్య సమరయోధుల వీరగాధ ‘స్వరాజ్’.. ప్రత్యేకంగా వీక్షించిన ప్రధాని మోడీ..
స్వరాజ్ సీరియల్ ప్రత్యేక ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులతో కలిసి వీక్షించారు. రెండు ఎపిసోడ్‌లను ప్రత్యేకంగా వీక్షించారు.
Swaraj serial: 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ ప్రసార సంస్థ దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న స్వరాజ్ ధారావాహికను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా వీక్షించారు. బుధవారం సాయంత్రం పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో దూరదర్శన్ రూపొందించిన స్వరాజ్ సీరియల్ ప్రత్యేక ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులతో కలిసి వీక్షించారు. రెండు ఎపిసోడ్‌లను ప్రత్యేకంగా వీక్షించారు. శివప్ప నాయక, రాణి అబ్బక్క జీవితంపై చీత్రీకరించిన రెండు ఎపిసోడ్‌లను ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతోపాటు క్యాబినెట్ మంత్రులంతా వీక్షించారు.
Delhi | PM Narendra Modi, BJP national president JP Nadda & Union Ministers attend the screening of Doordarshan-produced serial – ‘Swaraj: Bharat Ke Swatantrata Sangram ki Samagra Gatha’, at the Balayogi Auditorium, Parliament Library Building today pic.twitter.com/gZre3SVABC
ఇవి కూడా చదవండి— ANI (@ANI) August 17, 2022
స్వరాజ్ అనేది స్వాతంత్ర్య పోరాటం, అద్భుతమైన భారతీయ చరిత్ర గురించి వివరించే సీరియల్.. ఇది అందరికీ తెలియని భారత స్వాతంత్ర్య సంగ్రామ కథలను చూపించే 75 ఎపిసోడ్‌ల దారావాహిక. ఇది ఆగస్టు 14 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు డీడీ నేషనల్‌లో ప్రసారం అవుతోంది. ఈ సీరియల్‌ను హిందీ సహా తొమ్మిది ప్రాంతీయ భాషలలో ప్రసారం చేస్తున్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, ఒరియా, బెంగాలీ, అస్సామీలతో పాటు ఇంగ్లీష్‌లో కూడా డబ్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా.. స్వాంతంత్ర్య యోధుల పోరాట ఘట్టాలను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సీరియల్ ప్రాంతీయ భాషల్లో దూరదర్శన్ ప్రాంతీయ ఛానెల్‌లలో ఈ నెల 20 నుంచి ప్రసారం కానుంది. ఈ నెల 20 నుంచి ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రసారం కానుంది. 1498లో భారతదేశంలో వాస్కో-డ-గామా ఆగమనంతో ఈ సీరియల్ ప్రారంభమై.. రాణి అబ్బక్క, బక్షి జగబంధు, తిరోట్ సింగ్, సిద్ధు ముర్ము, కన్హు ముర్ము, శివప్ప నాయక, కన్హోజీ ఆంగ్రే, రాణి గైడిన్లియు, తిల్కా మాఝీ, రాణి లక్ష్మీబాయి, మహారాజ్ శివాజీ, తాత్యా తోపే, మేడమ్ భికాజీ వంటి స్వాతంత్ర్య సమరయోధులు, పోరాటంలో పాలు పంచుకున్న వారి వీర గాధలను ప్రసారం చేయనుంది.
ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..