Srilanka – China: శ్రీలంకను పావుగా చైనా కొత్త జిత్తులు.. ఓ కన్నేసి ఉంచిన ఇండియా..!

HambanTota Port: ఇండియా-చైనా.. మధ్యలో శ్రీలంక. ఏసియన్ కంట్రీస్ మధ్య ఇదో కొత్త చిచ్చు. ఇండియా మీద గూఢచర్యం కోసం లంకను పావుగా వాడుకుంటోంది డ్రాగన్ కంట్రీ.

Srilanka - China: శ్రీలంకను పావుగా చైనా కొత్త జిత్తులు.. ఓ కన్నేసి ఉంచిన ఇండియా..!
China Ship
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 17, 2022 | 9:22 PM

HambanTota Port: ఇండియా-చైనా.. మధ్యలో శ్రీలంక. ఏసియన్ కంట్రీస్ మధ్య ఇదో కొత్త చిచ్చు. ఇండియా మీద గూఢచర్యం కోసం లంకను పావుగా వాడుకుంటోంది డ్రాగన్ కంట్రీ. అవును భారత్ టార్గెట్‌గా చైనా పన్నుతున్న కుట్రల్లో ఇది తాజాతాజా కుట్ర. లంకలోని ఒక ఓడరేవును అడ్డాగా మార్చుకుని భారత్ భూభాగంలోకి ఫోకస్ పెట్టింది చైనా. ఆ పోర్టు పేరే హంబన్‌టోట. చైనీస్ మేడ్ సైంటిఫిక్ రిసెర్చ్ షిప్ ఒకటి ఆ పోర్టులోనే తిష్ట వేసుకుందిప్పుడు. అందులో జరిగేది రిసెర్చ్ మాత్రమేనా.. ఒకవేళ రిసెర్చే అయితే ఏ తరహా రిసెర్చ్.. ఆ రిసెర్చ్‌తో ఇండియాకొచ్చిన ప్రమాదమేంటి? తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ9. ఇందుకోసం నేరగా హంబన్‌టోట పోర్టుకు చేరుకుంది టీవీ9.

శ్రీలంక దక్షిణ తీరంలోని హంబన్‌టోటా విలేజ్‌ ఉంది. అదే పేరుతో ఎప్పట్నుంచో ఉన్న ఓడరేవును నడపలేక.. చైనా కంపెనీకి 99 సంవత్సరాలకు లీజ్‌కు ఇచ్చేసింది లంక ప్రభుత్వం. ఆ తర్వాత దాన్ని చైనా తన సొంతంగా భావించి.. పోర్టుకు అనుసంధానంగా ఎయిర్‌ పోర్టును కట్టుకుంది. కొలంబో నుంచి ఇక్కడికి ఎక్స్‌ప్రెస్‌ హైవే కూడా నిర్మించుకుంది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ వైడ్‌గా కాంట్రవర్సియల్‌గా మారిన హంబన్‌టోటలో స్టేటస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ9.

లంకలో ఉన్నామా లేక సింగపూర్‌లో ఉన్నామా..? అనే ఫీలింగ్.. హంబన్‌టోటాలో ఉంటుంది. ఎందుకంటే లంకలో ఎక్కడా కనిపించనంత అభివృద్ధి ఒక్క హంబన్‌టోటా పోర్టు ఏరియాలోనే కనిపిస్తుంది. మరి హంబన్‌టోటా పోర్టుపై చైనాకు ఎందుకంత ఇంట్రస్ట్? ప్రత్యేక శ్రద్ధ పెట్టి హంబన్‌ టోటాను ఇంత గొప్పగా అభివృద్ధి చేయాల్సిన అవసరం చైనాకు ఎందుకొచ్చింది? అనేది ఇప్పుడు అతిపెద్ద సందేహం.

ఇవి కూడా చదవండి

అసలు ఉద్దేశ్యం ఏంటి?

హంబన్‌టోటా కేంద్రంగా ప్రపంచ వాణిజ్యం మీద పట్టు సాధించడం, ఇటు.. ఇండియాపై సీక్రెట్‌గా నిఘా పెట్టడం చైనా ఉద్ధేశ్యం. చైనా ఇక్కడ కన్నెయ్యడం వెనకుండే పన్నాగం ఇదే. లంక సౌత్ కోస్ట్‌.. హిందూ మహాసముద్రంలో ఈ రూట్ ఒక హాట్‌స్పాట్ లాంటిది. అరేబియన్ కంట్రీస్ నుంచి సింగపూర్, మలేషియా, థాయ్, ఫిలిప్పైన్స్ లాంటి దేశాలకు వెళ్లాలంటే.. ఇదే షార్ట్ కట్. అందుకే.. సముద్రజలాల్లో జరిగే ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 70 శాతం ఈ మార్గం ద్వారానే షురూ అయ్యేది.

డీల్‌ను లెక్క చేయని చైనా..

అయితే, ఈ పోర్టును లీజ్‌కు తీసుకున్నప్పుడు లంకతో రాసుకున్న డీల్‌ని తుంగలో తొక్కేసింది చైనా. లెక్క ప్రకారమైతే ఇక్కడ నుంచి మిలిటరీ రిలేటెడ్ లాజిస్టిక్స్ జరక్కూడదు. కానీ లంకలో ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్ని అడ్డం పెట్టుకుని.. నిబంధనల్ని అతిక్రమిస్తూ ఇష్టారాజ్యంగా రాకపోకల్ని మొదలుపెట్టింది చైనా. ఆవిధంగా హంబన్‌టోట పోర్టులో ల్యాండ్ అయిందే.. ఈ వాంగ్‌యాంగ్-5. దీనిపైనే అనుమానాలు ఉన్నాయి.

సాదర ఆహ్వానం పలికిన చైనా..

ఇదిలాఉంటే.. దయచేయండి అంటూ చైనా నౌకను తమ పోర్టులోకి సాదరంగా ఆహ్వానించింది శ్రీలంక. ఈనెల 22 వరకు ఈ అనుమానాస్పద వెజెల్ హంబన్‌టోటా పోర్టులోనే ఉంటుంది. ఇదే ఇప్పుడు ఇండియాను కలవరపెడుతోన్న అంశం. ఇండియన్ నావికా దళాల మీద నిఘా పెట్టడానికే ఈ నౌకను లంక పోర్టులో లంగరేసింది చైనా.

రాజపక్స కుటుంబానికి సొంత అడ్డా..

హంబన్‌టోటా.. రాజపక్స కుటుంబానికి సొంత అడ్డా. వాళ్ల రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచే మొదలైంది. ఇండియా కంటే చైనానే వాళ్లకు మొదటి ప్రాధాన్యత. అందుకే.. గ్లోబల్ కాంట్రాక్టులను అప్పనంగా చైనీస్‌కే కట్టబెట్టడం రాజపక్స వంశీకుల అలవాటు. ఇప్పుడు హంబన్‌టోటాను కూడా చైనీస్‌కి ధారాదత్తం చేసింది. ఇప్పుడు వాంగ్‌యాంగ్-5 వెజెల్‌తో మొదలైంది చైనా కుటిలత్వం. ఇండియా కిందకు నీళ్లు తీసుకొచ్చే మరికొన్ని ఎత్తుగడలు హంబన్‌టోటా పోర్టు ద్వారా జరిగే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..