PM Modi – MK Stalin: ప్రధాని మోడీతో తమిళనాడు ముఖ్యమంత్రి భేటీ.. ఆ విషయాలపై కీలక చర్చ

ప్రధాని నరేంద్ర మోడీతో (PM Modi) తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల గురించి చర్చించారు. సీఎం ఎం.కె.స్టాలిన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో భేటీ అయ్యారు. ప్రధానిని సత్కరించి,..

PM Modi - MK Stalin: ప్రధాని మోడీతో తమిళనాడు ముఖ్యమంత్రి భేటీ.. ఆ విషయాలపై కీలక చర్చ
Modi Stalin
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 18, 2022 | 6:17 AM

ప్రధాని నరేంద్ర మోడీతో (PM Modi) తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల గురించి చర్చించారు. సీఎం ఎం.కె.స్టాలిన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో భేటీ అయ్యారు. ప్రధానిని సత్కరించి, తమిళనాడుకు (Tamil Nadu) సంబంధించిన ముఖ్యమైన డిమాండ్లను చర్చించారు. తమిళనాడులో జరిగిన చెస్ ఒలింపియాడ్ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రారంభించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. నీట్‌ మినహాయింపు బిల్లుకు ఆమోదం తెలపాలని, కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలకు మరిన్ని నిధుల కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మేఘదాతు డ్యామ్, ముల్లై పెరియార్ డ్యామ్ సమస్య, కాచిడావు రెస్క్యూ, మత్స్యకారుల జాతీయ కమిషన్, తమిళనాడులోని పెండింగ్ ప్రాజెక్టుల నిధులపై మాట్లాడారు. GST వాటా, విపత్తు సహాయాన్ని సకాలంలో అందించాలని ప్రధానమంత్రిని కోరారు. రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోకపోవడంపై ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. చెస్‌ ఒలంపియాడ్‌ తరహాలో రాష్ట్రంలో మరిన్ని జాతీయ క్రీడాపోటీలను నిర్వహించేందుకు అనుమతివ్వాలని చెప్పారు.

మరోవైపు.. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధనకర్‌ను స్టాలిన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి అభినందనలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం