Ratan Tata: మరో బృహత్తర కార్యక్రమానికి రతన్ టాటా శ్రీకారం.. అసలు సిసలు భారత రత్నమే..
యువకులకు ప్రోత్సహం అందిస్తూ ఎన్నో స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే రతన్ టాటా ఇటీవల గుడ్ ఫెలోస్ సంస్థలోనూ పెట్టుబడులు పెట్టడంతో ఈసంస్థ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. వృద్ధుల్లో ఒంతరితనాన్ని పొగట్టడమే లక్ష్యంగా ఈసంస్థ..
Ratan Tata: నేటి ఆధునిక కాలంలో ఇంట్లో ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన పరిస్థితి తప్పనిసరైంది. దీంట్లో ఇంట్లో పెద్ద వయస్కులైన తల్లిదండ్రులతో సమయం గడిపే తీరిక పిల్లలకు ఉండటంలేదు. కొంతమంది విదేశాల్లో ఉద్యోగాల వల్ల తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. దీంతో వృద్ధవయస్సులో పిల్లలతో గడపాలనే ఆనందానికి పెద్దవాళ్లు దూరవవుతున్నారు. దీనిని గమనించిన ఓ యువకుడు.. వృద్దులకు ఒంటరితనాన్ని పొగాట్టాలనే ఆలోచనతో ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. దీని ద్వారా ఒంటరితనంతో బాధపడేవారికి స్వాంతన కలిగిస్తూ వారిలో ఆబాధను పొగొట్టేందుకు పనిచేస్తోంది గుడ్ ఫెలోస్ సంస్థ. న్యూయర్క్ లోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన శంతను నాయుడు 2018 నుంచి ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు అసిస్టెంట్ గా ఉంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. 80 ఏళ్ల రతన్ టాటాకు.. 29 ఏళ్ల శంతను నాయుడి మధ్య మంచి అనుబంధం ఏర్పడంతో వచ్చిన ఆలోచనల్లోంచి శంతను నాయుడు గుడ్ ఫెలోస్ సంస్థను స్థాపించారు.
యువకులకు ప్రోత్సహం అందిస్తూ ఎన్నో స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే రతన్ టాటా ఇటీవల గుడ్ ఫెలోస్ సంస్థలోనూ పెట్టుబడులు పెట్టడంతో ఈసంస్థ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. వృద్ధుల్లో ఒంతరితనాన్ని పొగట్టడమే లక్ష్యంగా ఈసంస్థ పనిచేస్తుంది. వృద్ధులకు చాలా మందికి తమ పిల్లలతో, మనవళ్లతో ఆడుకోవాలని ఉంటుంది. అయితే అనివార్య కారణాలతో వారు దూరంగా ఉండటంతో వృద్ధుల ఆశ నెరవేరదు. ఇలాంటివారికి యువతను అనుసంధానిస్తూ కుటుంబ సభ్యులు మనతో లేరనే బాధను తీరుస్తుంది గుడ్ ఫెలోస్ సంస్థ. ఈసంస్థ అనేక సామర్థ్య పరీక్షలు నిర్వహించి కొంతమంది యువతను ఈపని కోసం ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికైన వారు వృద్ధులతో కలిసి క్యారమ్స్ ఆడటం, పేపర్ చదవడం, కలిసి తినడం, పడుకోవడం వంటి పనులను చేస్తారు. ఇలా చేయడం ద్వారా తాము ఒంటరి అనే భావనను తొలగించేందుకు ఈసంస్థ పనిచేస్తుంది.
లాభాపేక్షను ఆశించనప్పటికి.. సంస్థ అందించే సేవలకు కొంత సబ్ స్క్రిప్షన్ ఫీజును వసూలు చేస్తుంది. సబ్ స్క్రిప్షన్ తీసుకున్న క్లయింట్ వద్దకు సహచరుడిని వారంలో నాలుగు రోజుల పాటు పంపిస్తుంది. ఒకరోజులో నాలుగు గంటలకు తక్కువ కాకుండా ఆవ్యక్తి క్లయింట్ తో సమయాన్ని గడుపుతారు. ప్రస్తుతం ముంబయిలో 20 మంది వృద్ధులకు సేవలందిస్తున్న ఈసంస్థ భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరిస్తుందని శాంతను నాయుడు తెలిపారు. తమ సేవలు పొందాలనుకునేవారికి మొదటి నెల ఉచితంగా సేవలు అందిస్తారు. ఆతర్వాత నుంచి నెలకు రూ.5,000 సబ్ స్క్రిప్షన్ ఫీజుగా వసూలు చేస్తారు. ఈసంస్థలో పెట్టుబడులు పెట్టిన సందర్భంగా రతన్ టాటా మట్లాడుతూ.. ఈస్టార్టప్ వయో వృద్ధులకు అవసరమైన సేవలను, తోడును అందిస్తుందంటూ గుడ్ ఫెలోస్ సంస్థ వ్యవస్థాపకుడు శాంతను నాయుడుని ప్రశంసించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..