Wipro: విప్రో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. శాలరీ హైక్ కొనసాగుతుందని ప్రకటన..

వేతనాల పెంపును నిలిపివేస్తున్నట్లు వచ్చిన వార్తలపై ప్రముఖ ఐటి సంస్థ విప్రో స్పందించింది. సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రావల్సిన ఉద్యోగుల వేతనాల పెంపును నిలిపే ఉద్దేశం లేదని విప్రో ప్రకటించింది.

Wipro: విప్రో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. శాలరీ హైక్ కొనసాగుతుందని ప్రకటన..
Wipro
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 18, 2022 | 1:33 PM

Wipro: గత త్రైమాసికంలో సంస్థ లాభాలు తగ్గడంతో వేతనాల పెంపును నిలిపివేస్తున్నట్లు వచ్చిన వార్తలపై ప్రముఖ ఐటి సంస్థ విప్రో స్పందించింది. సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రావల్సిన ఉద్యోగుల వేతనాల పెంపును నిలిపే ఉద్దేశం లేదని విప్రో ప్రకటించింది. మీడియాలో వస్తున్నట్లు వేతనాల పెంపును నిలిపివేసే ఎటువంటి నిర్ణయాన్ని తాము తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. అలాగే ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలోనూ వెనుకడుగు వేయడం లేదని విప్రో ప్రకటించింది. ఇప్పటికే తొలి దశ ప్రమోషన్ల ప్రక్రియ పూర్తైందని ప్రకటించింది. ఏప్రిల్-జూన్ నెలలో కంపెనీకి లాభాలు తగ్గడంతో ఉద్యోగుల వేతనాల్లో భాగమైన వేరియబుల్ పేను కంపెనీ నిలిపివేస్తుందని ప్రచారం సాగింది. దీంతో సంస్థ ఉద్యోగులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఈనేపథయంలో కంపెనీ స్పందించింది.

వేతనాల పెంపుపై క్లారిటీ ఇచ్చిన విప్రో వేరియబుల్ పే చెల్లింపుల మొత్తంపై ఇప్పుడు తాము ఎలాంటి ప్రకటన చేయబోమని తెలిపింది. సంస్థ లాభాల ఆధారంగా ప్రతి 3 నెలలకు ఓసారి విప్రో సంస్థ తన ఉద్యోగులకు వేరియబుల్ పే చెల్లిస్తుంటుంది. కంపెనీ ఉద్యోగులకు ప్రమోషన్ల విషయంలోనూ విప్రో క్లారిటీ ఇచ్చింది. జులై నుంచి ప్రమోషన్లు అమల్లోకి వస్తున్నాయని.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన మిడ్ మేనేజ్ మెంట్ పై స్థాయి ఉద్యోగులకు త్రైమాసికాల వారీగా కూడా ప్రమోషన్ల కల్పిస్తామని ప్రకటించింది. కాగా ఈఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన సంస్థ లాభాలు 18.8 శాతం నుంచి 15 శాతానికి తగ్గిన క్రమంలో వేతనాల పెంపును నిలిపివేస్తుందనే వాదన బలంగా వినిపించింది. దీంతో కంపెనీ స్పందించడంతో ఈప్రచారంపై తెరపడింది.

ఇది కూడా చదవండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..