Salary: ఈ రంగాల్లో ఉన్న ఉద్యోగులకు శుభవార్త.. వచ్చే ఏడాది భారీగా పెరగనున్న జీతాలు.. తాజా నివేదికలో వెల్లడి..

Salary: కరోనా కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి, ఎంతో మంది ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారు. అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గింది. మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడినపడుతోంది...

Salary: ఈ రంగాల్లో ఉన్న ఉద్యోగులకు శుభవార్త.. వచ్చే ఏడాది భారీగా పెరగనున్న జీతాలు.. తాజా నివేదికలో వెల్లడి..
Salary Hike
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 18, 2022 | 7:28 AM

Salary: కరోనా కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి, ఎంతో మంది ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారు. అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గింది. మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడినపడుతోంది. ఉద్యోగ నియామకాలు సైతం ఊపందుకుంటున్నాయి. తాజాగా మళ్లీ ఆర్థిక మంద్యం తప్పదనన్న వాదనలు వినిపిస్తోన్న సమయంలో విల్లిస్‌ టవర్స్‌ వాట్సన్‌ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక కాస్త ఊరట కలిగించింది. భారత్‌లోని పలు కంపెనీలు వచ్చే ఏడాది తమ ఉద్యోగులకు 10 శాతం వేతనం పెంచే అవకాశం ఉందని అడ్వైజరీ, బ్రోకింగ్, సొల్యూషన్స్‌ కంపెనీ విల్లిస్‌ టవర్స్‌ వాట్సన్‌ నివేదికలో వెల్లడించింది.

ప్రస్తుత ఏడాదిలో ఉద్యోగుల జీతాలు 9.5 శాతం అధికం అయ్యాయని పేర్కొంది. వచ్చే ఏడాది జీతాలు 10 – 10.4 శాతం పెరగనున్నాయని తెలిపింది. ముఖ్యంగా ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బ్యాంకింగ్, టెక్నాలజీ, మీడియా, గేమింగ్‌ రంగాల్లో వేతనాలు అత్యధికంగా 10 – 10.4 శాతం పెరగనున్నాయి. 2022లోనూ ఈ రంగాల్లో జీతాలు పెరిగాయి. 2023 ఆర్థిక ఏడాదిలోనూ ఇదే ట్రెండ్ కొనసాగనుంది. పలు సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను వెల్లడించారు. దీని ప్రకారం గతేడాదితో పోలిస్తే వచ్చే ఏడాది 58 శాతం కంపెనీలు జీతాల పెంపుదల కోసం బడ్జెట్‌ను కేటాయించారు.

వారికి భారీ డిమాండ్‌..

ఇక వచ్చే ఏడాది డిజిటల్‌ నైపుణ్యాలున్న వారికి డిమాండ్‌ ఉంటుందని నివేదిక తెలిపింది. వచ్చే 12 నెలల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంజనీరింగ్, అమ్మకాలు, సాంకేతికంగా నైపుణ్యం కలిగిన వ్యాపారాలు, ఫైనాన్స్‌ రంగాల్లో నియామకాలు భారీగా ఉండనున్నాయి. డిజిటల్‌ స్కిల్స్‌ ఉన్న వారికి డిమాండ్‌ ఉండడం వేతనాల పెంపునకు కారణమవుతుంది నివేదిక వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ