NIT AP Recruitment: ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌ఐటీలో ఉద్యోగాలు.. స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

NIT AP Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని క్యాంపస్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు...

NIT AP Recruitment: ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌ఐటీలో ఉద్యోగాలు.. స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 18, 2022 | 8:26 AM

NIT AP Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని క్యాంపస్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పలు విభాగాల్లో ఉన్న 08 టెక్నిలక్‌ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీకాం, బీఏ ఉత్తీర్ణత, ట్యాలీ, అకౌంట్స్‌ సర్టిఫికేట్‌తో పాటు పని అనుభవం తప్పనిసరి. అలాగే డిగ్రీతో పాటు వెబ్ డిజైన్, నెట్‌వర్క్ పరికరాల నిర్వహణలో పరిజ్ఞానం ఉండాలి. సీసీఎన్‌ఏ/ సీసీఎన్‌పీ సర్టిఫికేషన్‌తో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి హాజరయ్యే ముందు వెబ్‌సైట్‌ ఉండే అప్లికేషన్‌ ఫామ్‌ను నింపి దానితో పాటు సంబంధిత డాక్యుమెంట్లను వెంట తెచ్చుకోవాలి.

* అభ్యర్థులను స్కిల్‌ టెస్ట్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలను రిజిస్ట్రార్ కార్యాలయం, సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ విస్టా, నిట్‌ ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* ఇంటర్వ్యూలను 19-08-2022 తేదీన నిర్వహిస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 22,000 జీతంగా అందిస్తారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..